విశ్వవిద్యాలయాలు సంఘీభావం, సామూహిక మేలు పెంపొందించే శక్తివంతమైన వేదికలు– పోప్
జోసెఫ్ అవినాష్
26 Jun 2026
జూన్ 26న వాటికన్ వేదికగా ఉత్తర అమెరికాలోని జేసుసభ ఆధ్వర్యంలో నడపబడుతున్న కతోలిక కళాశాలలు,విశ్వవిద్యాలయాల అధ్యక్షులతో పోప్ లియో XIV సమావేశమయ్యారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన పోప్,విద్యాసంస్థలు కేవలం విద్యను అందించే కేంద్రాలు మాత్రమే కాకుండా,సమాజంలోని అణగారిన వర్గాల అవసరాలను గుర్తించి,సంఘీభావం మరియు సామూహిక మేలు ఆధారంగా కొత్త సామాజిక మార్పుకు దారితీసే శక్తివంతమైన వేదికలుగా ఉండాలని పిలుపునిచ్చారు.నేటి యువతలో భవిష్యత్తుపై ఆశ తగ్గిపోవడం,కృత్రిమ మేధస్సు (AI) వేగంగా మానవ జీవితాన్ని ప్రభావితం చేయడం వంటి సవాళ్లను ప్రస్తావిస్తూ,ఈ డిజిటల్ యుగంలో మానవ గౌరవాన్ని కాపాడే విధంగా చర్చి సామాజిక బోధనలను సమకాలీన ప్రపంచానికి అన్వయించాల్సిన బాధ్యత కతోలిక విద్యాసంస్థలపై ఉందని ఆయన తెలిపారు.
