నేటి పునీతులు: పునీత యోహాను మరియు చిన్నప్ప
.jpg)
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
26 Jun 2026
పునీతులు యోహాను, చిన్నప్పగార్లంటే వీరు ఏసుప్రభుశిష్యులును అపోస్తులైన యోహాను, చిన్నప్పగార్లు కాదు. వీరు 4వ శతాబ్దంకు చెందినవారు. స్వంత అన్నదమ్ములు. రోము చక్రవర్తి కాస్టంటైన్ సైన్యంలో వీరు ఇద్దరూ సైనికాధికార్లు. చక్రవర్తి రాజ ప్రాసాదాన్ని సంరక్షించడం వీరిపని. తగినంత సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాట్లు చూసుకోవాలి. ఇది 24 గంటలూ పర్యవేక్షించే పని.
కొంతకాలం తర్వాత ఈ సోదర సైనిక అధికార్లకు జగ్జల్ గల్లికనస్ క్రింద పనిచేయడానికి చక్రవర్తి పురమాయించాడు. ఎక్కడ ఎప్పుడు యుద్ధం చేయాల్సివచ్చినా ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండే సైనికదళం ఇది. ఒకసారి ఈ పునీతుల ద్వయం జనరల్ కు ఒక ప్రవచనం చెప్పారు. త్రేస్ అనుప్రాంతంలో తమకూ సైతియన్ సేనలకు పెద్ద యుద్ధం జరుగబోతోందని ఆ యుద్ధంలో తాము ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు.
పరిష్కారంగా, జనరల్ గల్లికనస్ క్రీస్తును విశ్వసించి జ్ఞానస్నానం పొందితేనే తమకు జయం ప్రాప్తిస్తుందని బల్లగుద్దిపలికారు.
సంప్రదాయ చరిత్ర ప్రకారం జనరల్ గల్లికనస్ అట్లే యుద్ధంలో గెలిస్తే క్రైస్తవుడవుతానని వాగ్దానంచేశాడు. ప్రవచనం ప్రకారం యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో రోముసామ్రాజ్య సైనికుల తరఫున సైనిక రూపుదారులైన 'దేవదూతల సమూహం' యుద్ధంచేసి శత్రువులను తరిమికొట్టి విజయం అందించి అదృశ్యమయ్యారు.
అయితే అనంతరం చక్రవర్తిగా వచ్చిన జూలియన్కు విధేయించి పనిచేయడానికి ఈ పునీతుల ద్వయం అంగీకరించలేదు. అతడు స్వమత దురాభిమానియై విగ్రహారాధనకు పాల్పడటం వారికి నచ్చలేదు. తాము పదవులు పరిత్యజిస్తామని చెప్పారు. అందుకు చక్రవర్తి జూలియన్ ఆగ్రహించి తన ఆంతరంగిక భద్రతాదళంచే వారిరువురిని బంధింపచేసి విగ్రహారాధన' చేయమని దబ్బరదేవుళ్లకు మ్రొక్కమని ఆజ్ఞాపించాడు. వారు
తిరస్కరింపగా ఆవంక పై వారిని నేరస్థులుగా చూపి మరణశిక్ష విధింపచేశాడు. క్రీ||శ|| 362లో వారు వేదసాక్షి మరణం పొందారు.
