రోగుల సేవలో దేవుని కరుణను ప్రతిబింబించండి: పోప్

జోసెఫ్ అవినాష్

25 Jun 2026

జూన్ 24న కతోలిక శ్రీసభ ఆధ్వర్యంలో నడపబడుతున్న స్వచ్ఛంద సేవా సంస్థ కారిటాస్ ఇంటర్నేషనాలిస్ నిర్వహించిన “ఆరోగ్యానికి సమగ్ర దృక్పథం” అనే సమావేశానికి పంపిన సందేశంలో పోప్ లియో XIV,రోగుల సేవ కేవలం వైద్య సహాయం మాత్రమే కాకుండా,బాధపడుతున్న వారిపట్ల దేవుని ప్రేమను మరియు కరుణను వెల్లడించే సువార్త సేవగా ఉండాలని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో పనిచేసే సంస్థలు పరస్పర సహకారం, ఐక్యత మరియు సువార్త విలువల ఆధారంగా రోగుల సంరక్షణను మరింత మెరుగుపరచాలని ఆయన ప్రోత్సహించారు.యేసుక్రీస్తును “దివ్య వైద్యుడు”గా గుర్తుచేస్తూ,ఆయన శారీరక,మానసిక మరియు ఆత్మీయ బాధల నుండి మనుష్యులను స్వస్థపరచి వారికి గౌరవం,ఆశ మరియు సమాజంలో స్థానం కల్పించారని పోప్ వివరించారు. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవల్లో మరింత సహకారం మరియు మానవతా దృక్పథానికి నూతన ఉత్సాహాన్ని అందించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN