దివ్యసత్ప్రసాదం స్వీకరించడం ద్వారా మన జీవితాలు మార్పు చెందుతాయి - పోప్

జోసెఫ్ అవినాష్

25 Jun 2026

దివ్యసత్ప్రసాదం అనగా యేసుక్రీస్తు తన ప్రేమను,తన జీవితాన్ని మనతో పంచుకునే దివ్య రహస్యమని బుధవారం జనరల్ ఆడియన్స్ సందర్భంగా విశ్వ కాపరి పోప్ లియో XIV తెలిపారు.పవిత్ర దివ్యబలిపూజలో పాల్గొని,దివ్యసత్ప్రసాదం స్వీకరించటం ద్వారా సజీవుడైన క్రీస్తుతో నిజమైన ఐక్యతను అనుభవిస్తాము.దేవుని వాక్యాన్ని ఆలకించి,క్రీస్తు శరీరాన్ని స్వీకరించడం ద్వారా మన హృదయాలు మార్పు చెందుతాయి.దివ్యసత్ప్రసాదం మనలను స్వార్థం నుండి ప్రేమ వైపు,విభేదాల నుండి ఐక్యత వైపు,నిరాశ నుండి ఆశ వైపు నడిపిస్తుంది.క్రీస్తు తనను తాను మన కొరకు అర్పించుకున్నట్లే,మనమూ ఇతరుల కొరకు ప్రేమతో సేవ చేయడానికి ఈ దివ్య ఆహారం శక్తినిస్తుంది.అందువల్ల దివ్యసత్ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి,మన జీవితాలను క్రీస్తు ప్రేమకు సాక్ష్యంగా మార్చుకోవాలని పోప్ పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN