దివ్యబలిపూజలో గురువులు, డీకన్లు మాత్రమే ప్రసంగించాలి

జోసెఫ్ అవినాష్

24 Jun 2026

జర్మన్ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని జగద్గురువుని పరిపాలన యంత్రాంగం లోని దైవార్చన మరియు సప్త సంస్కారాల పరిరక్షణ విభాగం తిరస్కరించింది. గురువులు లేదా డీకన్లు అందుబాటులో లేని అసాధారణ పరిస్థితుల్లో అర్హత కలిగిన గృహస్థ విశ్వాసులు దివ్యబలిపూజలో ప్రసంగం చెప్పేందుకు అనుమతి ఇవ్వాలని జర్మన్ పీఠాధిపతులు కోరగా, ప్రసంగం అనేది పవిత్ర దైవార్చన స్వభావానికి సంబంధించిన అంశమని,అది కేవలం అభిషేకించబడిన గురువులు లేదా డీకన్లకే పరిమితమని వాటికన్ స్పష్టం చేసింది.అయితే, దేవాలయం వెలుపల జరిగే ప్రార్థనా సమావేశాలు మరియు ఇతర సందర్భాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడం,బోధించడం వంటి సేవలను గృహస్థ విశ్వాసులు నిర్వహించవచ్చని వాటికన్ నొక్కిచెప్పింది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN