ఆకలిపై పోరాటానికి ప్రపంచ ఐక్యత అవసరం: పోప్
జోసెఫ్ అవినాష్
23 Jun 2026
ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) ప్రధాన కార్యాలయాన్ని జూన్ 22న సందర్శించిన విశ్వ కాపరి పోప్ లియో XIV, ప్రపంచంలో యుద్ధాలకు ఖర్చు పెట్టడంలో చూపుతున్న ఆసక్తి,ఆకలితో బాధపడుతున్న ప్రజలకు ఆహారం అందించడంలో కనిపించడం లేదని విచారం వ్యక్తం చేశారు.ఆహారం ప్రతి మనిషి యొక్క మౌలిక హక్కు అని గుర్తుచేస్తూ,రాజకీయ ప్రయోజనాలు లేదా భౌగోళిక విభేదాలు మానవతా సహాయానికి అడ్డంకిగా మారకూడదని ఆయన పేర్కొన్నారు.యుద్ధాలు,వాతావరణ మార్పులు,ఆర్థిక సంక్షోభాలు కలిసి కోట్లాది మందిని ఆకలి బారిన పడేస్తున్నాయని హెచ్చరించిన ఆయన, ప్రపంచ దేశాలు ఐకమత్యంతో ముందుకు వచ్చి ఆకలిని నిర్మూలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.WFP సిబ్బంది,వారి కుటుంబ సభ్యులు మరియు కార్యనిర్వాహక మండలి సభ్యులతో కూడా ఆయన సమావేశమయ్యారు.
