సాంకేతికత నిజమైన స్నేహాలను బలోపేతం చేయాలి – పోప్
జోసెఫ్ అవినాష్
23 Jun 2026
పిల్లలు,యువత సాంకేతికతను జాగ్రత్తగా వినియోగించాలని, అది నిజమైన స్నేహాలను భర్తీ చేయకుండా వాటిని మరింత బలపరచడానికి ఉపయోగపడాలని విశ్వ కాపరి పోప్ లియో XIV పిలుపునిచ్చారు.వాటికన్ ఉద్యోగుల పిల్లల కోసం నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మొబైల్ ఫోన్లు,ఇతర డిజిటల్ సాధనాలు ఉపయోగకరమైనవే అయినప్పటికీ,అవి మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు,స్నేహాలు,కలిసి గడిపే ఆనందాన్ని తగ్గించకూడదని అన్నారు.ఎప్పుడూ తెరల ముందు గడపకుండా,స్నేహితులతో కలసి ఆడుకోవడం, మాట్లాడుకోవడం,పరస్పరం అనుభవాలను పంచుకోవడం ద్వారా నిజమైన ఆనందాన్ని అనుభవించాలని ఆయన పిల్లలను ప్రోత్సహించారు.
