తీర్పు చేయుట మన పనికాదు

జోసెఫ్ అవినాష్

21 Jun 2026

సామాన్య 12వ సోమవారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 7:1-5
ఈనాటి సువిశేష పఠనం "పరులపై తీర్పు' అనే అంశమును గురించి వివరిస్తూ మనిషిలోని అతి సామాన్యమైన మనస్తత్వాన్ని బయలు పరుస్తుంది.మన నిజ జీవితాన్ని ఇది సర్వసాధారణంగా కనిపించే విషయం. ఇక్కడ ఇతరులను మెచ్చుకునే దానికి బదులుగా, ప్రోత్సహించే దానికి బదులుగా ఖండించడం, నిందించడం చూస్తున్నాము. అసలు ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? అని మనం ఎన్నడు ఆలోచించం.అందుకే ప్రభువు మొదట మన మీద మనకు స్వీయ నియంత్రణ కల్గి ఉండాలి అని చెప్తూ పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు అని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే అదే కొలత మనకు కూడా కొలవబడుతుంది. ఎందుకంటే మొదట మన తప్పులను గుర్తించాలి. మనల్ని మనం సవరించుకోవాలి. తర్వాత ఇతరులను సరిదిద్దుట మనకు సులభతరము అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఎందుకు మనం ఇతరులను విమర్శిస్తున్నాం, ఖండిస్తున్నామో గ్రహించాలి. ఎందుకంటే
1) మనం మంచిని నమ్ముట కంటే చెడును ఎక్కువగా నమ్మటం,
2) మన స్వంత తప్పులకంటే ఇతరుల తప్పులను వెదకటం, 3) మనం ఇతరుల తప్పులను బహిరంగ పరచి, మన తప్పులను దాచిపెట్టటం
4) మనం దుష్ట జీవితం జీవిస్తూ కూడా ఇతరులను విమర్శిస్తాం. అంటే ఇప్పుడు మనకు ఆత్మీయ ఎదుగుదల, పరిణిత లేదని అర్థం.
5) మనం ఇతరులను ఖండిస్తున్నాం,విమర్శిస్తున్నాం అంటే మనము క్రీస్తులో ఎదుగుట లేదు అని అర్థం.
6) మనం ఇతరులను తీర్పు చేస్తున్నామంటే ఇది మనలోని దురాభిమాన్ని, వ్యక్తిగత అయిష్టతను, అభిప్రాయ బేధములను కల్గి ఉన్నామని అర్థం.
7) మనం చాలా సార్లు బాహ్యపరమైన చూపును బట్టి తీర్పు చేస్తాం. కాని ఇది ముమ్మాటికి తప్పు. ఇది ప్రభువు మార్గమునకు విరుద్ధము. కావున తీర్పు చేయుట మన పనికాదు. కాబట్టి తీర్పు చేయవద్దు శిక్షకు గురికావద్దు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN