నేటి పునీతులు: పునీత సిల్వేరియసు

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

20 Jun 2026

పునీత సిల్వేరియసు క్రీ||శ|| 536 జూన్ 8వ తేదీన 58వ శ్రీసభ అధినేతగా అధికారాన్ని చేపట్టారు. పోప్ అగాపిటసు గారి మరణవార్త రోముకు అందగానే థియోడాటను రాజు రోములో డీకనుగా సేవలందిస్తున్న సిల్వేరియాసుగార్ని పోగా ఎంపికచేశారు. ఈ సిల్వేరియసుగారి తండ్రికూడ గతంలో 52వ పోపు (క్రీ||శ|| 514 నుండి 523 వరకు) గా పనిచేసిన పునీత హార్మిస్ దాస్ గారి కుమారుడు. హోర్మి దాస్ గారు గురువు కాకముందే వివాహమాడి ఈ కుమారుని కన్నారు. తండ్రీకుమారులిరువురూ పోపుగార్లు కావడం ఇక్కడ జరిగింది.

అయితే రాజు, డీకన్ సిల్వేరియసుగార్ని పోపుగా ఎంపికచేయడం రాణియైన థియోడోరాకు సుతరాము ఇష్టం లేదు. కాన్స్టాంట్ నోపుల్ లో ఉన్న రోము నగర డీకను అయిన వర్జీలియస్ గార్ని పోప్ గా నియమించాలని, తద్వారా ఆమె తన చిరకాల వాంఛితమైన అంతిమ గార్ని అంతియోకు పీఠంకు బిషప్పుగా

అభిషేకింపచేయాలని పథకంవేసింది. తద్వారా

కాన్స్టాంట్ నోపుల్ అంతియోకు పీఠాల్ని పథకం

ప్రకారం మోనోఫిసిటియన్ (ఏసు ఏక స్వభావి

అని చెప్పు) శాఖవారి హస్తగతం చేయాలని

కుట్ర. అది విఫలమైంది.

ఎలాగైనా పోప్ కావాలని ఆశలు పెంచుకున్న డీకన్ వర్జీలియస్ రాణి ప్రతినిధియైన బెలిసారియతో కలసి కాన్స్టాంట్ నోపుల్ నుండి ఇటలీ చేరుకున్నాడు. ఆయన రోమునగరం రాగానే ఒహొగోతిక్ రాజు రోమునగరాన్ని ముట్టడించాడు. సిల్వేరియస్ పోవుగార్ని బంధించి గుర్తు తెలియని భవనానికి తరిలించుకుపోయి వారి అధికార వస్త్రాల్ని తీసివేసి ఆ దుస్తుల్ని వర్జీలియస్ డీకనుకు తొడిగి ఆయనే పోప్ అని ప్రకటించేశారు.

సిల్వేరియసుగారి నుండి క్రీ||శ|| 537 నవంబరు 11వ తేదీన బలవంతంగా రాజీనామా ఇప్పించి పాల్మారియా ద్వీవంకు తరలించబడేటు దేశ బహిష్కారంచేశాడు శత్రురాజు. సిల్వేరియస్ గారు పూర్తి సహనం వహించారు. తన ఆత్మను శ్రీసభను సంరక్షించాలంటే తనకు సహనమే ఆయుధమని, తనకు ఎదురైన ఎదురౌతున్న వరీక్షలు, కష్టాలన్నింటికి నహనమే నమాధానమని మిన్నకుండిపోయారు.

ఆకలిబాధకు అలమటించి పాల్మారియా ద్వీపంలోనే క్రీ||శ|| 538 డిసెంబరు 20వ తేదీన

వేదసాక్షి మరణంను ఆహ్వానించారు. సంపూర్ణ సహనం అనే మరోరాయి పై పేతురు శ్రీ సభనిలబడిందనుటలో సందేహం లేదు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN