పరలోక సంపదకై ఆశపడదాం

జోసెఫ్ అవినాష్
18 Jun 2026
సామాన్య 11వ శుక్రవారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 6:19-23
ఈ లోకంలో మనకున్న ధన ధాన్యములు, వెండి బంగారములు, ఆస్తిపాస్తులు దేవుని నుండి పరలోక జీవితము నుండి మనల్ని దూరం చేస్తాయి.
“ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంత మంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలిగిపోయి అనేక కష్టములపాలెరి” ఎప్పుడైతే మనము కడుపు నిండినవారుగా, సంమృద్ధిగా, తృప్తిగా ఉంటూ ఇతరులపై ఆధారపడే తత్వాన్ని ప్రేమించే తత్వాన్ని, ఆదరించే తత్వాన్ని కోల్పోతాం. ఈ కోవలో మన విశ్వాస జీవితం పలుచబారుతుంది.చివరికి ఇహ లోక ఐశ్వర్యము నిమిత్తమై దేవునిలో మనల్ని మనం కోల్పోతాము. ఈనాటి సువార్త పఠనములో యేసుప్రభువు స్వర్ణ సంపదలను గురించి ప్రస్తావిస్తూ ఈ లోకంలో ఎన్ని సమకూర్చుకున్నా అవి చివరకు ఏదో ఒక రకంగా మనకు దక్కకుండా పోతాయని హెచ్చరిస్తున్నాడు. నీవు సంపాదించినది ఏది నీతో రాదు. (విభవోనైన శాశ్వతః). అందుకే మన సంపదలు పరలోకమందు కూడబెట్టుకొనుమని ప్రభువు తెలియజేస్తున్నాడు.
ఈలోకంలో మన జీవితం శాశ్వతం కాదు. మనము ఈ లోకంలో యాత్రికులము మాత్రమే కావున ఇహలోక సంపదలపై మక్కువ తగదు. మరి ఏవిధంగా పరలోక సంపదలు కూడగట్టుకోగలము. లూకా 12:33 "మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు. మీ కొరకు చినిగిపోని సంపదలను సమకూర్చుకొనుడు".
లూకా 12:15. “జాగరూకత వహింపుడు. ఎట్టి లోభమునకు గురికాకుడు. ఏలయన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు" ఈ లోకంలో మంచి పనులు చేయటం ద్వారా పరలోక సంపదలను కూడబెట్టుకోవలెను. ఎందుకంటే నీ సంపదలున్నచోటనే నీ హృదయముండును. అదే విధంగా యేసుక్రీస్తు నేటి సువార్తలో వెలుగు నీడల గురించి మాట్లాడుతూ దేహమునకు దీపము కన్ను, ఆత్మకు నేత్రము మనసాక్షి, క్రీస్తు మాటలు, వెలుగు. ఆత్మ మనస్సాక్షి ఈ రెండునూ సరిగా సున్నచో జీవితము సరిగా ఉంటుంది. "నన్ను వెంబడించువాడు చీకటిలో నడమా జీవపు వెలుగు కలిగియుండును. విశ్వాసి జీవితము సరళ మార్గమున నడిపింపబడవలయునంటే ఈ రెండింటిపై ఆధారపడ వలయును. ఒకటి వెలుగు రెండవది కనుదృష్టి అనగా అత్మ మరియు దేవుని వాక్యము.
