పరలోక ప్రార్థన - పరిపూర్ణ ప్రార్ధన
.jpg)
జోసెఫ్ అవినాష్
17 Jun 2026
సామాన్య 11వ గురువారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 6:7-15
ఈనాటి సువార్త పఠనంలో అన్యులు చేసే ప్రార్థన గురించి ప్రస్తావిస్తూ యేసుప్రభువు వారి ప్రార్థనలోని వ్యర్థ పదాలను ఎత్తి చూపుతున్నాడు.ఎక్కువ పదాలు,నానార్థాలు సుందరమైన భాష వాడితే దేవుడు తమ ప్రార్థన తొందరగా ఆలకిస్తాడని వారి నమ్మకం. కానీ యేసుప్రభువు తన శిష్యులను వారిని అనుకరించ వద్దని స్పష్టంగా తెలియజేసాడు అంతే కాకుండా దేవుడు మన మనస్సు,మన అవసరాలు తెలిసినవాడు.అందుకే వారికి ఒక ఉన్నతమైన,సులువైన ప్రార్థనను నేర్పించాడు. అదే "ప్రభు ప్రార్థన లేదా పరలోక ప్రార్ధన”. దీనిని అర్థవంతంగా జపించడం వల్ల ముఖాముఖీ దేవునితో సంభాషించినట్లైతుంది. ఈ ప్రార్ధనతో మనం తండ్రి దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవచ్చు.ఈ పరలోక ప్రార్థన లేదా ప్రభు ప్రార్ధనను గమనిస్తే ఏడు విన్నపాలు కనిపిస్తాయి. వాటిని రెండు భాగాలుగా విభజించవచ్చు. రెండు భాగాలు రెండు ఉద్దేశ్యాలతో చెప్పబడినవి.
మొదటిది: దేవుని ఘనతకు, మహిమకు స్తుతులు. - నీ నామం పవిత్ర పరచబడును గాక. -
- నీ - రాజ్యం వచ్చును గాక.
- నీ చిత్తం నెరవేరును గాక. రెండవది: మన స్వంత అక్కరలు
- నేటికి కావలసిన అనుదిన భోజనం దయచేయుము.
- మా అప్పులను క్షమింపుము.
- మమ్ము శోధనలో చిక్కనియకుము.
- దుష్టుని నుండి కీడు నుండి రక్షింపుము.
-ప్రతి క్రైస్తవుడు ఎంతో అర్థవంతమైన ఈ పరలోక ప్రార్థనలో అర్థమెరిగి భక్తితో ఆచరిస్తే ఆ దేవుడు ఎల్లప్పుడూ మన అవసరాలు తీరుస్తాడు. మరి మనం చేసే పరలోక ప్రార్థన మనం చేసే ప్రార్ధన అర్థవంతంగా ఉంటోందా?
