పాతనిబంధనలోని ఆదిపంచకాన్ని (మొదటి ఐదు గ్రంథాలు) మోషే వ్రాశాడా?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
15 Jun 2026
పాతనిబంధనలోని ఆదిపంచకము అంటే, మొదటి ఐదు గ్రంథాలయిన ఆదికాండము,నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండము.దీనినే ఆంగ్లములో 'పెంటట్యూక్’ (Pentateuch) అని అంటారు.ఇశ్రాయేలీయులు, క్రైస్తవులు,శతాబ్దాల తరబడి మోషే ఆదిపంచక కర్త అని నమ్మారు.సువిశేషకారులు కూడా “మోషే మరియు ప్రవక్తలు..." అంటూ ప్రస్తావించడంలో ఆదిపంచక కర్త మోషే అనే అభిప్రాయం కలుగుతుంది (లూకా 16:29, 24:27) ఈ నమ్మకానికి రెండు బలమైన కారణాలున్నాయి. అవి:
ఆదిపంచకాన్ని 'తోరా' అని కూడా అన్నారు. ఇందులో పాతనిబంధనలోని అతిప్రముఖమైన భాగం దాగుంది. దేవుడు ఇస్రాయేలు ప్రజలతో ఏర్పరచుకొన్న 'ఒప్పందం', అందులోని నియమ నిబంధనలు ఈ తోరాలో వివరించబడి ఉన్నాయి. యావే ప్రభువుకూ, ప్రజలకూ మధ్యవర్తిగా కృషిచేసింది మోషే సీనాయి పర్వతం మీద జరిగిన నిబంధనలో మోషే పాత్ర అమోఘమైనది. దేవునితో అతడు తప్ప ఇంకెవరూ మాట్లాడటానికి సాహసించలేదు. కనీసం దైవ ప్రత్యక్షతను సమీపించడానికి అతనికి తప్ప ఇంకెవరికీ అర్హత లేదని చెప్పబడింది. అంతటి గొప్పవాడు కాబట్టే ఈ నియమ నిబంధనావళిని "మోషే ధర్మశాస్త్రము" అన్నారు.
2. ఆదిపంచకాన్ని చదివితే, మొదటి గ్రంథమయిన ఆదికాండం మినహా, మిగతా నాలుగు గ్రంథాలలోని ప్రతి సంఘటనలోనూ మోషే పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రంథాన్నిటిలోనూ అతడే నాయకుడు. ఇది కూడా పై నమ్మకానికి కారణమయి ఉండవచ్చు.
