గురుత్వ జీవితం మాటల్లో కాదు,పరిశుద్ధతలో ప్రకాశించాలి - పోప్

జోసెఫ్ అవినాష్

15 Jun 2026

ప్రపంచం ఈరోజు మాటలతో కాదు,క్రీస్తు సువాసనను వెదజల్లే జీవితాలతో సాక్ష్యమిచ్చే గురువులను కోరుకుంటోందని జూన్ 12న క్రీస్తు తిరు హృదయ పండుగ సందర్భంగా పోప్ లియో XIV పేర్కొన్నారు.క్రీస్తు తిరు హృదయ పండుగ రోజున తల్లి శ్రీసభ గురువుల పరిశుద్ధత కొరకు ప్రార్థించే ప్రత్యేక ప్రార్థన దినంగా కొనియాడుతుంది.ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ,దైవంకితుల పరిశుద్ధత అనేది కేవలం కఠిన తపస్సు లేదా పరిపూర్ణత కోసం చేసే ప్రయత్నం కాదని,యేసు పవిత్ర హృదయ ప్రేమకు పూర్తిగా లొంగిపోవడమేనని ఆయన వివరించారు.సరళమైన,నిర్మలమైన హృదయం కలిగిన గురువు సేవ మధ్యలోనూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ, కష్టసమయాల్లో కరుణతో నిలిచి,తన జీవితాన్ని ఇతరుల కోసం అర్పించగలడని చెప్పారు.ఒంటరితనంలో కాకుండా సహ గురువులతో ఐక్యంగా నడుస్తూ,ప్రార్థన,దైవవాక్య ధ్యానం,పరిశుద్ధబలిపూజతో జీవితం నూతనంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ విధంగా క్రీస్తు హృదయంతో ఏకమై జీవించే గురువులు సమాజంలో ఐక్యత,శాంతి, దయలకు జీవసాక్షులవుతారని పోప్ సందేశమిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN