ఇదే రక్షణ దినం

జోసెఫ్ అవినాష్
14 Jun 2026
సామాన్య 11వ సోమవారం
సువిశేషం
మత్తయి 5:38-42
ధ్యానం:
పూర్వవేదంలో ఇశ్రాయేలుల ప్రజల జీవిత గమనంలో మరి ముఖ్యంగా కనాను దేశానికి ప్రయాణంలో వారిని నడిపిస్తున్న నాయకులు వారికి కొన్ని నియమాలను,చట్టాలను ఏర్పటు చేశారు.ఇవి వారి జీవన విధానాన్ని బట్టి ఇవ్వబడ్డాయి.ఎందుకంటే వారు వెళ్లే మార్గంలో అనేక జాతులు తెగలు,రాజ్యాలు వారిని అడ్డగించేవారు వారిని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసేవారు.ఈ క్రమంలో కొన్ని నియమాలు అందివ్వబడ్డాయి.ఈనాటి సువార్తలో యేసుక్రీస్తు ప్రతీకారం గురించి మాట్లాడుతూ పూర్వం "కంటికి కన్ను, పంటికి పన్ను” అని మీ శత్రువులను గురించి చెప్పబడింది గదా, ఇప్పుడు దానిని విస్మరించాలి, మానుకోవాలి అని బోధించాడు.ఆనాడు ఈ నియమం నాటి పరిస్థితులను బట్టి మాత్రమే ఇవ్వబడింది.కానీ ఇప్పుడు నీకు అపకారం చేసిన వానిపై ప్రతీకారం తీర్చుకోవద్దు అని సరికొత్త జీవిత విధానాన్ని అందించాడు.ఇక్కడ మనమంతా గమనించాల్సింది మన క్రైస్తవ జీవితంలో ప్రతీకారం అనేదే లేదు అనే ఒక కొత్త జీవన ఒరవడికి యేసు పునాది వేసాడు.
- పగ తీర్చుకోవడం క్రైస్తవ నైజం కాదు.
- ఎడమ చెంపపై కూడా కొట్టనిమ్ము.
నీ పైవస్త్రం సైతం ఇమ్ము. - ·
అరమైలు దూరం రమ్మన్నా వానితో మైలు దూరం వెళ్లుము. -
- అడిగిన వానికి లేదనక ఇమ్ము.
యేసుక్రీస్తు బోధించిన ఈ నూతన మార్గదర్శకాలను, తద్వారా తీసుకొచ్చిన మార్పును బట్టి మనం జీవించాలి.అపుడే మన జీవితం ధన్యమౌతుంది.పది మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. కనుక మనం మారాలి.మనకివ్వబడిన సమయం గొప్పది.ఇదే అనుకూలమైన సమయం.ఇదే రక్షణ దినం.
