అద్భుత రీతిగా జరిగిన పునీత అంతోని గారి పండుగ

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
14 Jun 2026
విశాఖ అగ్ర పీఠంలోని "విజయనగరం" విచారణ పాలక పునీతుడైన పునీత అంతోని వారి పండుగను కడు వైభవంగా జరిగింది.దివ్య పూజాబలి,ప్రసంగం గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాశ్ గారు ప్రధానార్చకులుగా,ఇతర గురువులు, భారతమిత్రం సంపాదకులు ఫాదర్ చల్ల డేవిడ్ పండుగ సమిష్టి పూజను సమర్పించారు. అనేకమంది చిన్నారులు ప్రధమ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించారు.సుమారు 2 వేల క్రెస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. కతోలిక పక్ష పత్రిక ప్రధాన సంపాదకులు ఫాదర్ చల్ల డేవిడ్ గారు భారతమిత్రం పత్రిక ప్రాముఖ్యతను గురించి తెలియపరిచారు. పలువురు పత్రికను స్వీకరించారు.
