ఐక్యతకు సాక్షులుగా నిలుద్దాం –పోప్
జోసెఫ్ అవినాష్
10 Jun 2026
స్పెయిన్ పర్యటనలో భాగంగా బార్సిలోనా నగరంలోని పునీత యూలాలియా కేథడ్రల్‌లో మధ్యాహ్న ప్రార్థనకు అధ్యక్షత వహించిన జగద్గురువులు పోప్ లియో XIV, క్రైస్తవులు విభజనలు,యుద్ధాలు,స్వార్థం పెరుగుతున్న ఈ కాలంలో ఐక్యత,ఆతిథ్యం,సామరస్యం మరియు శాంతికి సాక్షులుగా ఉండాలని పిలుపునిచ్చారు.బార్సిలోనా విశ్వాస సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, “మీ అందరిలోని భిన్నమైన వరాలు, సేవలు, జీవన కథల ద్వారా దేవుడు తన అందాన్ని,మేలును ప్రపంచానికి చూపిస్తున్నాడు” అని అన్నారు. సంఘం అనేది దేవుని ప్రియ వధువు అని గుర్తుచేస్తూ ప్రతి విశ్వాసి తన జీవితంతో క్రీస్తు ప్రేమను ప్రతిబింబించాలన్నారు.త్యాగం చేయాల్సి వచ్చినా,భేదాలను అధిగమించి పరస్పర ప్రేమతో జీవించే వారు నిజమైన ఐక్యత ప్రవక్తలుగా మారుతారని పోప్ ప్రోత్సహించారు.
