గర్వాన్ని విడిచిపెడదాం, దైవ ప్రేమను హత్తుకుందాం

జోసెఫ్ అవినాష్

10 Jun 2026

సామాన్య 10వ బుధవారం
సువిశేషం
మత్తయి 5:17-19
ధ్యానం:
మనిషిలో దినదినం పెరిగే అసూయ,ఈర్ష్యాద్వేషాలు, కోపం,పగా,ప్రతీకారాలు అతని జీవితాన్ని మరో ప్రపంచంలోకి నెట్టివేస్తుంది.అతనిలోని అవగుణాలు అతని జీవితాన్ని బంధించి వేస్తాయి.అందుకే అతని జీవితం ఆ దుర్గుణాల చుట్టూ తిరుగుతూ అందులోని క్షణికానందాన్ని ఆస్వాదిస్తూ ఆ స్థితిలోనే బతకాలని కోరుకుంటాడు.ఆ స్థితిలో ఉన్న వాడు మన క్రైస్తవ జీవితానికి అతి ముఖ్యమైన ఆజ్ఞను మరచిపోతాడు.ఒకవేళ అతడు మొదటి ఆజ్ఞ సరేశ్వరుని మాత్రమే ఆరాధించుదువు గాక! అనేది గుర్తుంచుకున్న,రెండవ ఆజ్ఞ నీ వలె నీ పొరుగువానిని ప్రేమింపుము అనే దానిని చాల అశ్రద్ధ చేస్తున్నాడు.అందుకే నేటి సమాజంలో విద్వేషాలు పెరిగిపోతున్నాయి,నేటి సువార్తలో ప్రభువు నరహత్య చేయరాదు అని చెబుతూ ఇంకో నూతన జీవన విధానాన్ని ఇచ్చారు.నీ సోదరునిపై కోపపడరాదు అని, వ్యర్థుడా అని దూషించరాదు అని.ఒకరిని అంతం చేయాలనో,హత్య చేయాలనో ఆలోచన రావడం ఆ వ్యక్తిపై అయిష్టత వల్లనో,అతనిపై కోపం వల్లనో,అతను పనికిరాదనే తలంపు వల్లనో మాత్రమే హృదయంలో జనిస్తుంది.అందుకే యేసు ప్రభువు ఏ దుష్టమనస్కులను హెచ్చరిస్తున్నాడు.ఇలాంటి ఆలోచనలతో బలిపీఠ సన్నిధిలో ఏ కానుక సమర్పించినా నీ ప్రార్థన ఫలించదు.ఎప్పుడైతే వెంటనే వెళ్లి నీతో మనస్పర్ధ కలిగిన వ్యక్తితో నీవు సఖ్యత పడతావో నీ కానుక అంగీకరించబడుతుంది.

రెండవదిగా నిన్ను నీవు అంగీకరించ గలగాలి.వీలైతే ఆయా పరిసితులను బట్టి నీ విరోధులు విషయంలో సమాధానపడాలి.నీ శక్తి,నీ యుక్తి, నీ శక్తులు కొన్నిసార్లు నీ జీవితాన్ని నిలబెడతాయి. అందుకే యేసుప్రభువు నేటి సువార్తలో నీకున్న అవకాశాలను బట్టి తెలివిగా జీవించాలి అని కోరుకుంటున్నారు.లేకపోతె నీ గర్వమే నీకు ముందుగా నడుస్తుంది.నీ పతనాన్ని శాసిస్తుంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN