క్రీస్తు ప్రేమతో ప్రజలకు ఆశాకిరణాలుగా నిలవండి:స్పెయిన్ పీఠాధిపతులకు పోప్ పిలుపు

జోసెఫ్ అవినాష్

08 Jun 2026

విశ్వ కాపరి పోప్ లియో XIV తన అపోస్తలిక పర్యటనలో భాగంగా స్పెయిన్ లో పర్యటిస్తున్న విషయం విధితమే. స్పెయిన్ పీఠాధిపతులతో జరిగిన సమావేశంలో పోప్ లియో XIV, శ్రీసభ యొక్క నిజమైన బలం సంపదలోనో, అధికారంలోనో లేదని,క్రీస్తును ప్రేమిస్తూ పవిత్ర జీవితాన్ని గడిపే విశ్వాసులలోనే ఉందని గుర్తుచేశారు.నేటి ప్రపంచంలో పెరుగుతున్న విభేదాలు,విభజనలు,నిరాశల మధ్య పీఠాధిపతులు ఐక్యతకు,సంభాషణకు,సమాధానానికి మార్గదర్శకులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.ముఖ్యంగా యువత,వలసదారులు,పేదలు మరియు అట్టడుగు వర్గాలకు దగ్గరగా ఉంటూ వారిలో ఆశను నింపాలని సూచించారు.అలాగే ప్రతి పీఠాధిపతి తన యాజకులకు కేవలం అధికారిగా కాకుండా తండ్రిలా అండగా నిలవాలని, ప్రార్థనలో నిలకడగా ఉండి ప్రేమతో సేవ చేసే యాజకులను ప్రోత్సహించాలని కోరారు.క్రీస్తు హృదయాన్ని తమ హృదయంగా చేసుకుని ప్రేమతో సేవ చేసే శ్రీసభయే ప్రతి సవాలును ఎదుర్కొనే శక్తిని పొందుతుందని పోప్ హితవు పలికారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN