బలిపూజలో ఏం జరుగుతుందో శ్రద్ధగా గమనించండి - పోప్

జోసెఫ్ అవినాష్

06 Jun 2026

కతోలిక విశ్వాస జీవితం కేవలం మాటలతోనే కాకుండా, హృదయాన్ని తాకే సంకేతాలు,ఆచారాల ద్వారా కూడా వ్యక్తమవుతుందని విశ్వ కాపరి పోప్ లియో XIV జనరల్ ఆడియన్స్ లో తెలిపారు.చర్చిలో జరిగే ప్రతి ప్రార్థన, ప్రతి చర్య, ప్రతి చిహ్నం మనలను దేవుని సన్నిధికి మరింత చేరువ చేస్తుందని ఆయన వివరించారు.ఈ సంకేతాల అసలు అర్థాన్ని గ్రహించినప్పుడు పూజావిధి కేవలం ఒక సంప్రదాయంగా కాకుండా,జీవించి ఉన్న క్రీస్తును అనుభవించే ఆధ్యాత్మిక సమావేశంగా మారుతుందని చెప్పారు.అందువల్ల విశ్వాసులు పూజావిధిలోని ప్రతి అంశాన్ని శ్రద్ధతో స్వీకరిస్తూ, వాటి ద్వారా దేవుడు అందించే కృపను గుర్తించాలంటూ పోప్ పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN