సినడాలిటీ ఆచరణ సమావేశం

T.c.b.c సమాచారం
06 Jun 2026
జూన్ 6వ తేదీన, హైదరాబాద్ లోని పునీత యోహాను ప్రాంతీయ గురువిద్యాలయ ప్రాంగణములో ఆంధ్రా, తెలంగాణ కతోలిక పీఠాల సినడాలిటీ కమిటీ సభ్యుల సమావేశం మహా పూజ్య కరణం ధమన్ కుమార్ MSFS, నల్గొండ పీఠాధిపతులు,TCBC జనరల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో దివ్యపూజబలితో ప్రారంభమైంది.గడచిన కాలములో సినడాలిటీకి సంబంధించిన అంశాలు,అనుదిన జీవితంలో ఇంతవరకు క్రియాశీలకముగా పాటిస్తున్నామా?,ఇంకా సినడాలటి యొక్క ఫలాలు ఫలించాలంటే మనందరం ఏమి చేయాలి అనే విషయాలపై పీఠాధిపతితో కలిసి గురువులు, గృహస్థ క్రైస్తవులు విస్తృత చర్చలు,సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగింది.అన్ని పీఠాల నుంచి కొంతమంది గురువులు,గృహస్థ క్రైస్తవులు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకొన్నారు.కలిసి పయనించడం (సినడాలిటీ) వలన పొందిన సంతోషకరమైన ఆనందకరమైన ఫలాలను,జీవిత అనుభవాలను గురించి తెలియజేశారు.
