క్రీస్తే మన రక్షకుడు

జోసెఫ్ అవినాష్

04 Jun 2026

సామాన్య 9వ శుక్రవారం
సువిశేష ధ్యానం:
మార్కు 12:35-37
ఇప్పటి వరకు గత కొన్ని సందర్భాలలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువును తికమక ప్రశ్నలు వేస్తూ ఆయనను మాటలతో ఇబ్బంది పెట్టారు.అయినాగానీ ప్రభువు వారికీ సరైన సమాధానాలు ఇస్తూ వారి పన్నాగాలను నిర్వీర్యం చేసాడు.మరి ఈ రోజు ప్రశ్నలు అడగడం ప్రభువు వంతు. ఆయన అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగాడు. "క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు?" ఈ ప్రశ్నను ఒక సవాలుగా వారిని అడిగాడు.ఎందుకంటే పరిసయ్యులు మెస్సయ్య రాకడను మానవ భాషలో అర్థం చేసుకున్నారు.అంటే మెస్సయను ఒక సాధారణ రాజుగా మాత్రమే గుర్తించారు. వారికీ పాత నిబంధన గ్రంథంలో మెస్సయా గురించి చెప్పబడిన మతాల యెడల సరైన అవగాహనా లేదు. అందుకే ఈ భూలోక రాజువలె, తన రక్తాన్ని చిందించి శత్రువులను ఓడించి వారిని కాపాడుతాడు అని భావించారు.దేవుడంటే వారికీ ఇదే అవగాహనా ఉంది. అందుకే దేవునికి వారికీ వ్యక్తిగత సంబంధం పెద్దగా కనిపించదు.

ఈ రోజు మనకు కూడా ఒక మంచి రోజు.మన విశ్వాసాన్ని ప్రశ్నించుకునే రోజు.నిజంగా దేవుడు నాకు తెలుసా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? దేవుని పూజించడానికి,దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని పెంపొందించుకోడానికి ప్రతి దినం నేను ఆయన ఆలయానికి వెళ్తున్నానా? లేదా ఏదో వెళ్ళళ్ళని దేవుని సన్నిధికి వెళ్తున్నానా? హృదయపూర్వకంగా వెళ్తున్నానా? కొద్దీ నిముషాలు ఆత్మపరిశీలన చేసుకొని ఒక నాణ్యమైన, ఉన్నతమైన బంధాన్ని యేసుప్రభువుతో ఏర్పరచుకోడానికి ఆయననే మన మెస్సయ్యగా అంగీకరించి ఆయన పాలనలో ఫలించడానికి ప్రయత్నించుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN