దివ్యసత్ప్రసాద ప్రదక్షిణలో భక్తివంతముగా పాల్గొందాం - పోప్
జోసెఫ్ అవినాష్
04 Jun 2026
జూన్ 7న తల్లి శ్రీసభ క్రీస్తు శరీర రక్తముల మహోత్సవాన్ని జరుపుకొనుంది.మన కతోలిక విశ్వాస సాంప్రదాయంలో ఆనాడు దివ్యసత్ప్రసాదాన్ని బహిరంగముగా మన గ్రామ పురవీధులలో ఊరేగిస్తూ,దివ్యసత్ప్రసాద భక్తిని మనం ప్రకటిస్తాం.ఈ సందర్భంగా విశ్వ కాపరి పోప్ లియో XIV మాట్లాడుతూ,దివ్యసత్ప్రసాద ప్రదక్షిణ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు,క్రీస్తు నిజంగా తన ప్రజల మధ్య జీవిస్తూ నడుస్తున్నాడనే విశ్వాసానికి బహిరంగ సాక్ష్యమని ఆయన గుర్తుచేశారు.కుటుంబాలు,యువత,పిల్లలు ఈ ఊరేగింపులలో పాల్గొని తమ విశ్వాసాన్ని ధైర్యంగా ప్రకటించాలని ప్రోత్సహించారు.దివ్యసత్ప్రసాదంలో
మన కొరకు తనను తాను అర్పించిన క్రీస్తును మనం దర్శిస్తామని చెబుతూ,ఆయన ప్రేమను ప్రపంచానికి చాటే సాక్షులుగా జీవించాలని పిలుపునిచ్చారు.
