ప్రేమ కలిగి జీవించాలి

జోసెఫ్ అవినాష్

03 Jun 2026

సామాన్య 9వ గురువారం
సువిశేష ధ్యానం:
మార్కు 12:28-34
ఈనాటి సువార్తలో మరోసారి పరిసయ్యులు,ధర్మశాస్త్ర బోధకులు యేసుప్రభువును ప్రశ్నించడం,పరీక్షించడం చూస్తున్నాం.వీరు సంఘంలో పెద్దలు.ధర్మశాస్త్ర సత్యాలను తెలుసుకున్నవారు వారికీ ప్రశ్నించడం,చర్చించడం ఒక వ్యాపకం.ప్రభువు చేత ఏదో ఒక పొరపాటు మాట పలికించి నేరం మోపాలని ధర్మశాస్త్ర బోధకుల పన్నాగం.ఒక క్రమబద్ధమైన జీవిత విధానానికి కొన్ని మార్గదర్శకాలు,విధివిధానాలు ఉంటాయి.పూర్వవేదంలో ఇశ్రాయేలు ప్రజలు ఎదగడానికి,ఉన్నతంగా జీవించడానికి దేవుడు వారికీ కొన్ని ఆజ్ఞలిచ్చాడు.మొత్తం 63 ఆజ్ఞలు.అందులో 65 నిషేదాజ్ఞులు 248 మనం కలిగి ఉండాల్సిన ఆజ్ఞలు.ఇవన్నీ ఆ ధర్మశాస్త్ర బోధకునికి తెలుసుగాని యేసుప్రభువు అవగాహనను పరీక్షించాలని ప్రయత్నించాడు.ఇక్కడ ప్రభువు చాల లోతైన అర్థం కలిగిన సమాధానం ఇచ్చాడు. ధర్మశాస్త్ర బోధకుడు నిజాన్ని గ్రహించే అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే చివరలో ఆ ధర్మశాస్త్ర బోధకుడు దేవుని ప్రేమించుట, తోటి వారిని ప్రేమించుట సమస్త హోమాల కంటే,సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికాడు.ఎందుకంటే యేసుప్రభువు ఇచ్చిన సమాధానం ఈ లోకంలో మన జీవితమెంతో మన ప్రపంచమేంటో మన పని ఏంటో తేటతెల్లం చేసింది.మన జీవితంలో ప్రథమ స్థానం దేవునికే.ఆయనే మన జీవ ప్రదాత. ఆయనకే మనం సర్వం అర్పించాలి.ఆయన మన ఉనికి కారకుడు.కనుక ఆయనను సంపూర్ణంగా ప్రేమించాలి.అందుకే ఇది ప్రధాన ఆజ్ఞగా చెప్పబడింది. ఇక నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగు వానిని ప్రేమించాలి అన్నది రెండవ ఆజ్ఞ.దేవుని తర్వాత మన ప్రపంచం మన తోటి వారే. వారు మన రూపంలో ఉన్నవారు,మనతో జీవిస్తున్నవారు.మనతోనే నిత్యం సహవాసం చేస్తున్నవారు.కాబట్టి వీటిని ఆజ్ఞలుగా చూడకుండా మన జీవితానికి మార్గదర్శకాలుగా గుర్తించాలి. అందుకే "తోడి వారిని ప్రేమించువాడు ఎవరికి ఏ కీడును చేయడు.కనుక ప్రేమ కలిగి ఉందుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే” (రోమీ 13:10). కనుక ప్రేమ కలిగి జీవించాలి. అటు దేవుని సంపూర్ణంగా ప్రేమిస్తూ తోటివారిని ఆదరించాలి. అదే ప్రభువు మనలా నుండి ఆశించే జీవితం అంతేగాని దేవుని ప్రేమించక, తోటివారిని ప్రేమించక నేను పూజలు చేస్తాను,ప్రార్ధన చేస్తాను అని నీకు నీవే బంధించుకుంటే అంట వ్యర్థమే.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN