జూన్ నెల ప్రార్ధనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్

జోసెఫ్ అవినాష్

03 Jun 2026

జూన్ నెలలో విశ్వ శ్రీసభ ప్రార్థించాల్సిన ప్రార్థనా ఉద్దేశాన్ని పోప్ లియో XIV ప్రకటించారు.క్రీడల విలువల కోసం ప్రార్థించాలని విశ్వాసులను ఆహ్వానించారు.క్రీడలు సోదరభావానికి,శాంతికి మార్గం కావాలని ఆయన ఆకాంక్షించారు.క్రీడలు కేవలం గెలుపు-ఓటముల పోటీ కాకుండా,మనుషులను దగ్గర చేసే వేదికగా మారాలని ఆయన చెప్పారు.మైదానంలో ఏర్పడే స్నేహాలు,జట్టు భావన, పరస్పర గౌరవం జీవితానికి గొప్ప పాఠాలు నేర్పుతాయని గుర్తుచేశారు.భిన్న సంస్కృతులు,దేశాల ప్రజలను ఒకే కుటుంబంలా కలిపే విశ్వవ్యాప్త భాషగా క్రీడలు మారి,గౌరవం, సంఘీభావం,వ్యక్తిగత వికాసం వంటి విలువలను పెంపొందించాలని పోప్ ఆకాంక్షించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN