విశ్వాస సత్యాల ఎడల సరైన అవగాహన కలిగి జీవించాలి

జోసెఫ్ అవినాష్

02 Jun 2026

సామాన్య 9వ బుధవారం
మార్కు 12:18-27
ధ్యానం:
అజ్ఞానం,అవివేకం,సరైన అవగాహనలేమి మనల్ని వెర్రివాళ్ళను చేస్తుంది.మతపరమైన అవగాహన ఉండాలంటే మతానికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు,విశ్వాస సత్యాలు మనకు తెలిసి ఉండాలి.ఆధ్యాత్మికత అనేది మనిషి అంధకారం తొలిగించాలే గాని జీవితాన్ని అధోగతిపాలు చేయకూడదు. ఈనాటి సువార్త పఠనంలో
సద్దూకయ్యులు యేసుప్రభువును మృతుల పునరుత్థానం గురించి ప్రశ్నించారు.ఇది వారి అవివేకాన్ని, ఈర్ష్యాద్వేషాలను బయలుపరుస్తున్నాయి. అంతేకాకుండా మతపరమైన
సత్యాల విషయంలో వారికి సరైన అవగాహన లేదు అని అర్థమౌతోంది.సద్దుకయ్యులు మోషే గ్రంథాలను మాత్రమే అంగీకరిస్తారు.ఆత్మ, మరణంతో జీవితం, పునరుత్థానం,అంతిమ తీర్పు, దేవదూతలు,దురాత్మలు మొదలైన వాటిని విశ్వసింపరు. వీరిలో చాలామంది ధనిక యాజకులు.వీరి మొండి వైఖిరిని కలిగి ఉంటారు.ఇతరులను అంత సులువుగా అంగీకరింపరు. వీరు వివాహ చట్టము గురించి యేసును ఒక ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నను తెలుసుకోవాలి అనే ఆశతో కాక ప్రభువును తికమక పెట్టే ఆలోచనతో ప్రశ్నించారు. ఒక స్త్రీ వరుసగా ఏడుగురు అన్నదమ్ములను వివాహమాడింది.మరి పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్య అవుతుంది అనేదే వారి ప్రశ్న.ఇక్కడ సద్దూకయ్యులకు పునరుత్థాన అవగాహన లేదు కాబట్టి మరణం తర్వాత కూడా ఈ లోక సంబంధాలే ఉంటాయని పొరబడ్డారు.కానీ యేసుప్రభువు వారి పరిమిత జ్ఞానాన్ని ఎరిగిన వాడై వారికి మంచి సమాధానమిచ్చాడు. ఇక్కడ పరిసయ్యులు రెండు విషయాలు తెలియవు అని అర్థమౌతోంది.మొదటిది దేవుని శక్తి.రెండవది లేఖనాల ఎడల అవగాహన.పునరుత్థానమంటే ఇప్పుడు మనకు కలిగిన జీవితం మళ్ళీ రావడం కాదు. ఒక భిన్నమైన జీవంలోకి ప్రవేశించడమే.పునరుత్థానం. ఆ నూతన జీవంలోకి ప్రవేశించడానికి దేవుడు మనకు కొత్త శరీరాలు ఇస్తాడు. "తన సంకల్పాన్ని అనుసరించి దేవుడు దానికి శరీరాన్ని ఒసగుతాడు.ఒక్కొక్క గింజకును వాటికి తగిన శరీరాన్ని ఒసగుతాడు.అట్లే జీవకోటి శరీరాలన్నీ ఒకే విధంగా వుండవు.మానవులకు ఒక విధం,జంతువులకు మరొక విధం,పక్షులకు వేరొక విధం, చేపలకు ఇంకొక విధం..." (1 కొరింతి 15:38-39). దేవదూతలవలె ఉండడమంటే లైంగికపరమైన తేడాలు ఉండవు.అది ఒక పరిపూర్ణ స్థితి.వివాహం,సంతానోత్పత్తి, మరణం మొదలైనవి ఉండవు. కాబట్టి మరణం తర్వాత మనుషులు మరొక జీవితం కలిగి ఉండరు కావున ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక అజీవితంలో మత విశ్వాస సత్యాల ఎడల సరైన అవగాహన కలిగి జీవించాలి. అప్పుడే పరిపూర్ణత సాధించగలదు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN