మందలింపు కూడ మరువ వద్దు!.
డా. కల్లూరి ఆనందరావు
01 Jun 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................
పిల్లలు చెడిరన్న పెద్దలదే తప్పు!
చిగురు పాడయినచొ చెట్టు తప్పు!
పెంపకమ్ము లోన ప్రేమ చూపుటె కాదు
మందలింపు కూడ మరువ వద్దు!.
