ప్రేమతో ఏకమై ఉన్న త్రిత్వమే క్రైస్తవ జీవితానికి ఆదర్శం - పోప్
జోసెఫ్ అవినాష్
01 Jun 2026
నికోదేము యేసును వెతుక్కుంటూ వచ్చినట్లే,ప్రతి మనిషి హృదయం కూడా నిజమైన శాంతి,ప్రేమ,ఆత్మీయత కోసం వెతుకుతూనే ఉంటుందని త్రియేక సర్వేశ్వరుని పండుగ సందర్భంగా పోప్ చెప్పారు.ఆ వెతుకులాటకు సమాధానం త్రిత్వ దేవునిలోనే ఉందని వివరించారు.తండ్రి,కుమారుడు, పరిశుద్ధాత్మల మధ్య ఉన్న ప్రేమ మరియు ఐక్యత మనుషుల జీవితానికి ఆదర్శమని,దేవునితో సన్నిహిత సంబంధంలో ఉన్నప్పుడు మాత్రమే మన హృదయానికి నిజమైన విశ్రాంతి, శాంతి లభిస్తాయని చెప్పారు.దేవుని ప్రేమ మనలను ఆయనతోనే కాకుండా పరస్పరం ఒకరికొకరిని కూడా దగ్గర చేస్తుందని,అందువల్ల క్రైస్తవ జీవితం అనేది ఒంటరిగా కాకుండా ప్రేమతో కూడిన సహవాస జీవితమని పోప్ గుర్తుచేశారు.
