"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
31 May 2026
దేవా!!
నా కురూపం మార్చ నెంచీ
నీ కుమారుని పంపి నావా!
అడ్డు యని, నే గుడ్డిగా, నీ
బిడ్డనే హత మార్చి నానే,
పాప పరి హారార్థ శిక్షకు
పాప సంకీర్తనలు చాలునొ ?
మరణ దండన అమలుతో నా
దురిత పంకం తొలగ గలదో??
