శాంతిస్థాపనే మన ధ్యేయం కావాలి - పోప్
జోసెఫ్ అవినాష్
31 May 2026
మరియమాతకు అంకితమైన మే మాసపు ముగింపు వేడుకల్లో భాగంగా విశ్వ కాపరి పోప్ లియో XIV వాటికన్ ఉద్యానవనంలోని లూర్థుమాత గృహ దగ్గర మే 30న జపమాల ప్రార్ధనలో పాల్గొని ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించారు.ఆయన మాట్లాడుతూ,నిజమైన ప్రార్థన మనసులను మార్చగలదని,ద్వేషాన్ని ప్రేమగా,ప్రతీకారాన్ని క్షమగా మార్చే శక్తి దేవుని కృపకు ఉందని చెప్పారు.ఆయుధాలు కాదు,పరస్పర సంభాషణ మరియు సోదరభావమే శాంతికి మార్గమని గుర్తుచేస్తూ,ప్రపంచ నాయకులు ప్రజల మేలు కోసం శాంతి ప్రయత్నాలను బలోపేతం చేయాలని కోరారు.అలాగే యుద్ధాల వల్ల బాధపడుతున్న వారందరికీ సంఘీభావం తెలియజేస్తూ, ప్రపంచమంతా శాంతి కోసం ఏకమనసుతో ప్రార్థించాలని ఆహ్వానించారు.
