నవ్వు ముఖము పెట్టు! సమసి పోవు!.

డా. కల్లూరి ఆనందరావు
30 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
సద్దు మణగనట్టి సణుగుడు కొక మందు
మౌనము తలదాల్చు! అణగి పోవు!
వాదమున గెలుచుట వల్ల కాదందువా?
నవ్వు ముఖము పెట్టు! సమసి పోవు!.
