అవని పులకరించి అమ్మ యౌను!

డా. కల్లూరి ఆనందరావు
29 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
అదను లోన కురియు పదునైన వానతో
అవని పులకరించి అమ్మ యౌను!
అవసరమ్ము లోన అందిన చేయూత
బాధలుపశమింప పథ్యమౌను!.
