దేవుడు కరుణామయుడు

జోసెఫ్ అవినాష్

27 May 2026

సామాన్య 8వ గురువారం
సువిశేష ధ్యానం
మార్కు 10:46-52
ఈనాటి సువార్త పఠనంలో బర్తిమయి విశ్వాసం ద్వారా దృష్టి పొందడాన్ని చూస్తున్నాం.అతని గురించి:

1. చలించని విశ్వాసంతో ఉన్నాడు, అతను బహుశా యేసుప్రభువును అంతవరకూ కలిసి ఉండకపోవచ్చు.కానీ కచ్చితంగా అతని గురించి విని ఉంటాడు.అతడే నాకు ముక్తిని ప్రసాదించగలడు,అతడే నాకు దృష్టిని అనుగ్రహించగలడు. నా జీవితాన్ని మార్చగలడు అనే నిండైన విశ్వాసం అతనిలో ఉంది.అది అతని నిరీక్షణ..

2. అవకాశం కోసం ఎదురుచూశాడు:
ప్రభువు దొరికినప్పుడే అతనిని సమీపించాలి.అతడు దగ్గరలో ఉన్నప్పుడే అతనిని ప్రార్థించాలి (యెషయా 55:6).అలాగే బర్తిమయి యేసుప్రభువు రాకడ కోసం ఎదురుచూశాడు. కాచుకొని ఉన్నాడు. అవకాశాన్ని వదులుకోలేదు.

3. ఎలుగెత్తి ప్రార్థించాడు:
దావీదు కుమారా! యేసుప్రభూ! నన్ను రక్షించు అని బిగ్గరగా కేకేలు పెట్టాడు. అనేకులు గద్దించిన వారి మాటలు పట్టించుకోలేదు.

4. అన్ని విడిచిపెట్టి యేసును చేరాడు:
గుడ్డివాడు, భిక్షగాడు అతని దగ్గర ఏముంటుంది పైవస్త్రమే అతని అస్తి.దాన్ని విడిచిపెట్టి యేసును అనుసరించాడు. దృష్టిని పొందాడు.బర్తిమయిని ఆదర్శంగా తీసుకోని దేవుడి ఈ రోజు మన ప్రార్థన ఆలకించలేదని నిరుత్సాహ పడవద్దు.ఇతరులు నీ విశ్వాసాన్ని హేళన చేసారని, ఎగతాళి చేసారని బాధపడకుండా ప్రార్థించు. ఎలుగెత్తి ఆయనకు వినపడేంత వరకు ప్రార్థించు. అయన కరుణమయిడు. మనలను కనికరిస్తాడు. మనపై ప్రేమను చూపుతాడు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN