కతోలిక దైవార్చనలో కొన్ని మార్పులు అవసరం - పోప్

జోసెఫ్ అవినాష్

27 May 2026

శ్రీసభ సంప్రదాయాలను గౌరవిస్తూ,కతోలిక దైవార్చనలో కాలానికి అనుగుణంగా అవసరమైన మార్పులను కూడా స్వీకరించాల్సిన అవసరం ఉందని జనరల్ ఆడియన్స్ సందర్భంగా పోప్ లియో XIV చెప్పారు.నిజమైన సంప్రదాయం అంటే గతంలో ఉన్నదాన్నే అలాగే పట్టుకొని ఉండటం కాదు; అది పవిత్రాత్మ నడిపింపుతో కాలానుగుణంగా ఎదుగుతూ ఉండే జీవమయమైన విశ్వాసం అని ఆయన వివరించారు.రెండవ వాటికన్ మహాసభ తర్వాత స్థానిక భాషల్లో దివ్యబలిపూజ జరపడం,విశ్వాసులు మరింత చురుకుగా పాల్గొనేలా చేయడం వంటి మార్పులు శ్రీసభను ప్రజలకు మరింత దగ్గర చేశాయని చెప్పారు.ఈ మార్పులు సంప్రదాయాన్ని మార్చేయడానికి కాదు,దాని అసలు అర్థాన్ని ప్రజలకు మరింత స్పష్టంగా అందించడానికి జరిగాయని ఆయన గుర్తుచేశారు.అందువల్ల సంప్రదాయం మరియు నూత్నీకరణ రెండూ కలిసి నడిచినప్పుడే శ్రీసభ తన లక్ష్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చగలదని పోప్ తెలిపారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN