యంత్రాల కంటే మనిషే విలువైనవాడు: పోప్

జోసెఫ్ అవినాష్

26 May 2026

అప్పటి 13వ లియో పాపు గారు పారిశ్రామిక విప్లవం వల్ల కార్మిక వర్గం ఎదుర్కొంటున్న కఠినమైన,దోపిడీ పరిస్థితులను ప్రస్తావిస్తూ,ఆధునిక కతోలిక సామాజిక బోధనకు పునాది వేసిన Rerum novarum అధికారిక లేఖ విడుదలై నేటికీ 135 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా ప్రస్తుత జగద్గురువులు పోప్ లియో XIV ‘Magnifica humanitas: On Safeguarding the Human Person in the Time of Artificial Intelligence.’ పేరుతో తన తొలి అధికారిక సందేశ పత్రాన్ని విడుదల చేశారు.కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో, మానవ గౌరవం మరియు వ్యక్తిత్వాన్ని కాపాడటం అత్యంత ముఖ్యమని పోప్ తన తొలి అధికారిక సందేశ పత్రమైన Magnifica Humanitas లో పేర్కొన్నారు. సాంకేతికత మనిషికి సేవ చేయడానికి ఉద్దేశించబడిందని, మనిషిపై ఆధిపత్యం చెలాయించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు.AI వల్ల ఉద్యోగాలు,సామాజిక న్యాయం, సత్యం మరియు శాంతిపై ప్రభావం పడే ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరిస్తూ, మానవులను కేవలం డేటాగా లేదా యంత్రాల నిర్ణయాలకు లోబడిన సాధనాలుగా చూడకూడదని చెప్పారు. సాంకేతిక పురోగతి నిజమైన మానవ అభివృద్ధికి, సోదరభావానికి మరియు సమాజంలోని ప్రతి వ్యక్తి మేలుకు దోహదపడినప్పుడే అది విలువైనదని పోప్ నొక్కిచెప్పారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN