పవిత్రాత్ముడు భయం,విభేదాలను తొలగించి ప్రపంచాన్ని ఐక్యత వైపు నడిపిస్తాడు – పోప్
జోసెఫ్ అవినాష్
25 May 2026
పెంతుకోస్తు పండుగ సందర్భంగా విశ్వ కాపరి పోప్ లియో XIV మాట్లాడుతూ,పవిత్రాత్ముడు ఈ రోజుకీ శ్రీసభలోను, ప్రపంచంలోను కార్యశీలుడిగా ఉన్నాడని చెప్పారు.ఆయన మన హృదయాలను దేవుని ప్రేమకు తెరిచి,భయం,స్వార్థం, విభేదాలను తొలగించి సోదరభావం,ఐక్యత మరియు శాంతి వైపు నడిపిస్తాడని వివరించారు.ప్రపంచం యుద్ధాలు,ద్వేషం మరియు విభజనలతో బాధపడుతున్న ఈ కాలంలో,పవిత్రాత్ముడే మానవాళిని కలుపుతూ ఆశను నింపే శక్తి అని పోప్ గుర్తుచేశారు.క్రైస్తవులు తమ జీవితాలతో సువార్తకు సాక్షులై, ప్రేమ,కరుణ మరియు సయోధ్య సందేశాన్ని ప్రపంచానికి అందించాలని ఆయన పిలుపునిచ్చారు.పవిత్రాత్మునికి తమను పూర్తిగా అప్పగించినప్పుడు వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు,సమాజం మరియు ప్రపంచం కూడా దేవుని ప్రేమతో నూతనంగా మారుతుందని ఆయన చెప్పారు.
