అగ్నిజ్వాలల రూపం – విశ్వాసానికి దీపం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
23 May 2026
పెంతుకోస్తు మహోత్సవం
మొదటి పఠనము : అపో 2:1-11
రెండవ పఠనము :1 కొరింథీ 12:3-7,12-13
సువిశేష పఠనము : యోహాను 20:19-23
ప్రియులారా పవిత్రాత్ముడు చేయు కొన్ని కార్యములను భక్తి విశ్వాసములతో ధ్యానం చేసుకుందాము. ఆయన మనలోకి వచ్చినప్పుడు, మనదగ్గరికి వచ్చినప్పుడు మనకోసం ఆయన ఎన్నో చేయును, మనలను త్రిత్వముతో ఉంచుటకు, త్రిత్వ ప్రేమలో పెరుగుటకు, లోక ప్రేమలో దూరం అగుటకు ఈ ఆత్ముడు మనకు ఆదరణగా, ఆత్పుడిగ మనతో ఉండును.
పవిత్రాత్మ చేయు క్రియలు లేదా కార్యములు
1. మనలను సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తుంది :-ఆత్మ దేవుని ఆగమనము, మనలను సత్యములోనికి తీసుకుని వెళ్తుంది. సత్యమనే పదము విజయవంతం అవుతుంది. నిజ మరియు అబద్ధాల మధ్య కలతతో జీవిస్తున్న ఎందరికో సత్యం దాని నిర్వచనం పొల్లుపోకుండా బట్టబయలు అవుతుంది. అసత్యానికి, అబద్దానికి, అన్యాయానికి మరియు అక్రమాలకు తావు ఉండదు. సత్తమేమిటో దాని సంపూర్ణ వివరణ ఏమిటో ఈ ఆత్మ మనలకు తోడై, సహవాసియై నిలుస్తుంది. యోహాను 14:17.....ఆయన సత్య స్వరూపియగు ఆత్మ, మీయందు ఉండును అని వాక్యం సెలవిస్తుంది.
2. యేసు గురించి సాక్షం ఇస్తుంది:- ఆయన దైవకుమారుడు అని, ఆయన ద్వారా అసాధ్యమైనది సాధ్యామవుతుందని, లోకాపాపాలుమోయవచ్చిన రక్షకుడని, పితరులు ఎదురుచూసిన మేసయ్యా అని, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనమని, లోకసృష్టికి మునుపే ఉన్నావాడని, అల్ప మరియు ఒమేగా అని, మానవ అవతారం ఎత్తిన దైవ సంబూతుడు అని, ఆయనను మించిన దేవుడు లేడని, ఆయనే సర్వధికారని, నిజ దేవుడని సాక్షమిస్తుంది. 1 కొరింథీ 12:3...కనుక దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియు, యేసు నాశనమగును గాక అని పలుక జాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మ చే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింప జాలడు. ఆత్మ సహకారం, ఆత్మ సహాయం, ఆత్మ లేనిదీ మనము ఏమి చేయలేము. ఆయన తోడు, మనలను నిజ విశ్వాసులుగా క్రీస్తుకు సాక్షులుగా చేయగలదు. ఆత్మ లేనిదీ, ఆత్మ లేకున్నా, ఆత్మ నడిపింపు లేకుండా, మేము చేస్తాము, చేయగలము, మేము రానించగలము, మేము బోధించగలము, అని మాట్లాడే వ్యక్తి కూడ క్రీస్తు బోధకుడు కాదని, ఆత్మచే నింపబడి, క్రీస్తుకై బోధించే వాడే నిజమైన వారని వాక్యం సెలవిస్తుంది.
3. యేసు ప్రభువుచే మనతో ఎల్లప్పుడు ఉండుటకు ఏర్పాటుబడినవారు :- యోహాను 14:16.....నేను తండ్రిని ప్రార్థింతును. మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణ కర్తను ఆయన మీకు అనుగ్రహించును. త్రిత్వయిక దేవుడు ఎన్నుకున్న మనతో ఎల్లప్పుడు వుండాలని వారికి ఎంతో అభిలాష. మనలను అనాధలుగా వదలివేయటం వారికి అయిష్టం. మనము త్రిత్వమును మరిచిన, ఆ త్రిత్వము మనతోనే నివసించాలని అనుకుంటుంది. దేవుడు లేడని వాపోయే ఎందరో ప్రభద్దులకు మన ప్రభువుల వారు ఇస్తున్న సమాధానము నేను మీతోనే వుందును. మీతోనే వుంటాను, మీకోరకే వుంటాను అని మరి ప్రియులారా త్రిత్వము మనలో ఉందని, మనకై ఉందని, మనకై వెంచేసి ఉందని ఎంతమందికి అర్తం అవుతుంది.
4. పాపము, నీతి, తీర్పు గురించి లోకమునకు నిరూపించును:- యోహాను16:8.....అవినీతికి, అబద్ధాలకు, అన్యాయాలకు, పాపాలకు, లోకాశలకు, మోసపూరితమునకు, పర్యాయ పదముల బ్రతుకుతున్న వారందరు జవాబు చెప్పవలసిన గడియ ఉండును అని, మన క్రియాలన్నింటికి తేదీలతో సహా లెక్క చెప్పాలని, ఎవరు తప్పించుకోలేరని, తప్పించుకొన ప్రయత్నం చేసిన అవదని, పవిత్రాత్మ దేవుడు గమనిస్తున్నారని మనకు తెలియ జేస్తున్నాడు. మనము పాపము + గర్వము = నేనేరాజని విర్రవీగుతున్నాము...... మన పాపాలు + లెక్కింపుతనం = న్యాయతీర్పు ఉంటదని అంటున్నాడు ఆత్మ దేవుడు.
5. యేసయ్యను మహిమపరుచును:- యోహాను 16:14...ఆయన నన్ను మహిమపరుచును. యేసయ్యను ప్రకటించును, ఆయన నామమును గణపరుచును, కీర్తిని రెట్టింపు చేయును, విలువైన క్రియలను లోకానికి బోధించును. మనము సువార్తను మరిచిపోతాము కానీ ఆయన మరువడు. ఆయనను హెచ్చిస్తాడు, లోకానికి అందిస్తాడు. ఆయన నామమును తెలియని వారికి తెలియజేయును. ఆయన గొప్ప కార్యము, ఈయనను మహిమ పరచటమే.
6. భిన్నత్వములో ఏకత్వమును సాధిస్తుంది:- అపో 2:6,8........ ఆ విశ్వాసులు తమ సొంత బాషలో మాట్లాడటం అందరిని కలవరపడేలా చేసింది. మన సొంత బాషలో వినుచున్నాము. అని ఆశ్చర్య పోయారు. అందరిని ఒకటీ చేసింది ఆత్మ. అందరిపై ఒకటై నిలిచింది జ్వాల. అందరికి ఒకే బాష, ఒకే వాతావరణం అందించింది ఆత్మ, అందరిపై ఏకరీతిగా కృమ్మరింపబడింది. ఐక్యతకు చిహ్నం, ఐక్యతకు గుర్తు, అందరిని ఒకటీ చేయటమే కార్యము కానీ, వేరు చేసేది కాదు ఆత్మ. మనము కూడ ఎటువంటి వర్గ బేధాలు లేకుండా జీవించాలి. అందరం ఒక్కటై పోవాలి. ఎటువంటి బేధాలు, ఉండకూడదు ఆలా వున్న చోట ఆత్మ ఉండదు. ఆత్మ వున్న చోట బేధాలు వుండవు. ఒకవేళ ఉంటే అక్కడ ఆత్మ నడిపింపు లేదని ఆత్మనుసారము కాకుండ, వారి ఇష్టాను సారము జీవిస్తున్నామని అర్తం.
7. ఉత్తానములో భాగమును కల్పిస్తుంది :- రోమీ 8:11......దేవుని ఆత్మ మీయందు వున్నచో..... తన ఆత్మ వలన మీ నశించు శరీరకములకు కూడా జీవమును ఒసగును. పునరుత్థానములో మనకు కూడా భాగస్వామ్యమును కల్పిస్తుంది. పాడైపోయిన మన ఆత్మలకు నిత్య జీవితమును ఒసగుతాడు. కుళ్ళి మట్టిలో కలిసిపోయే మన శరీరాలకు, ఉత్తానమును అనుగ్రహిస్తారు. ఆయన ప్రేమలో, ఆయనలో ఒకటీ చేస్తారు. మనలను ఈ ఖాగోల మన్నులో కాకా, పరలోకములో స్థిరత్వ నివాసమును పరిపూర్ణముగా అనుగ్రహిస్తారు. ఆత్మ మనలను నిలబెట్టుతుందని, ఆత్మ మనలను క్రీస్తులు కడుతుంది. ఆత్మ మనలను ప్రేమతో చూస్తుంది అని అనుటకు ఇది నిండైనా ఉజ్జీవ ఉదాహరణ.
8. ఆత్మ వలన మనము దేవుని బిడ్డలుగా రూపొందుతాము :- రోమీ 8:14.....దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ఆత్మపరిశీలన గావించుకోవాలి. ఆత్మ వలన నడిపింపబడుతున్నామా, ఆత్మ చేత జీవితమును ముందుకు కొనసాగుతున్నామా, ఆత్మ మనలో, మన కుటుంబాలలో మన సాటి, తోటి, పొరిగింటి, ప్రక్కింటి, ఎదురింటి వారిలో ఉందా ఆత్మీయత కనపడుతుందా. ఆత్మీయ సహకారముతో మనము అడుగులు వేస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన గావించుకోవాలి. ఆత్మ వలన నడిపింపు కలిగిన పుత్రునివా, పుత్రికవా.. ఆత్మ ఉందా, ఆత్మ నీ స్నేహమా ఆత్మ నీ నివాసమా, ఆత్మ నీ సహకారమా, ఆత్మ నీ బాంధవ్యమా, ఆత్మ నీ ఊనికా, కాదా నీవే ఆత్మ తో ఆత్మ పరిశీలన గావించుకో. రోమీ 8:17.....?మనము పుత్రులము కనుక వారసులము, నిజముగా దేవుని వారసులము..... క్రీస్తు తో వారసులము.
9. ప్రార్థించే శక్తిని ఇస్తుంది:- రోమీ 8:26...బలహీనులమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఎట్లు ప్రార్తించాలో మనకు తెలియదు. మనకొరకై ఆత్మ తొడ్పడును. దేవునికి దగ్గర చేయును. అన్నియు కూడా ఆత్మచే ప్రేరేపింపబడినవే, ఎలా ఉండాలో, ఎలా మెలగాలో, ఎలా స్తుతించాలో, ఆరాధించాలో, ఘనపరచ్చాలో, ప్రవర్తించ్చాలో ఎలా దేవునికి దగ్గర అవ్వాలో ఎలా విశ్వాసమును నిలదోక్కుకోవాలో ఆత్మ మనలను ముందుకు తీసుకువెళ్తుంది.
10. దేవుని పరమరహస్యములను వెల్లడి చేస్తుంది.:- 1 కొరింథీ 2:10..కానీ ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యములను వెల్లడించెను. దేవుని పరమ రహస్యములను, ఆయనకు మనపై గళ ప్రగాఢ నిర్ణయాలను, రహస్యములను, గమ్మతులను, అద్భుతాలను, భవిష్యత్తు ను, సజీవ సువార్త లోతులను దాని బావములను, దాని అర్థములను, ప్రతి పదార్తములను వాటినాన్నింటిని విపులీకరణముగా మనకు తెలియజేస్తుంది. లోతయినవి అర్తం కావలి అంటే ఆత్మ సహాయం చాలా అవసరము.
11. మన దేహాన్ని తన ఆలయముగా మారుస్తుంది:- 1కొరింథీ 6:9....మీ శరీరము...... ఆలయమని మీకు తెలియదా..... దేవుని ఆలయం మనదేహము. పవిత్రం మన దేహము, మన దేహాలు పరిశుభ్రముగా, పరిశుదముగా ఉండాలి. ఆలయమైన నీ దేహం నూతనీకరింపబడాలి. ఆత్మతో ఏర్పరచిన శరీరం కావాల లేక లోకముతో కూడిన శరీరం కావాలా నీవే నిర్ణయించుకొ.....
12. అందరి మేలు కొరకు తన శరీరమును ఒక్కొక్కటిగా అనుగ్రహిస్తుంది:- 1కొరింథీ 12:7.....2 కొరింథీ 13:14.....యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, దేవుని ప్రేమయు, పవిత్రాత్మ సహవాసమును మీకు అందరకును లభించును గాక..... మనకొరకు ప్రాడెయపడుతూ మనలను నిత్య శ్రేయస్కారముగా మారుస్తుంది. నిలకడ కలిగిన విశ్వాసిగా మారుస్తుంది, చేస్తుంది. కావున మనము కూడా ఆత్మ ప్రేరణతో జీవిస్తూ ఆయన రాజ్యములో కలకాలము ఆత్మీయముగా, ఆత్మీయతను పొందుకుందాము.
దేవుడు మనలను దీవించును గాక...
