AI యుగంలో క్రీస్తును మరువకండి – పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్

23 May 2026

కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో, సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించేందుకు ప్రజలకు సరైన మార్గదర్శకత్వం అవసరమని విశ్వ కాపరి పోప్ లియో XIV తెలిపారు.మనిషి గౌరవం, సత్యం, పరస్పర సంబంధాలు వంటి మౌలిక విలువలను ఏ యంత్రం భర్తీ చేయలేదని ఆయన గుర్తుచేశారు. సాంకేతిక పురోగతి మన జీవితాలను మెరుగుపరచాలి గానీ, మనలను దేవుని నుండి లేదా ఒకరినొకరు దూరం చేయకూడదని చెప్పారు. ముఖ్యంగా యువత సాంకేతికతను వివేకంతో వినియోగిస్తూ, దానికి బానిసలుగా కాకుండా దానిని మంచి కోసం ఉపయోగించాలన్నారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన ప్రశ్న సాంకేతికత గురించి కాక, “మనిషి అంటే ఎవరు?” అనే దాని గురించేనని పేర్కొంటూ, ప్రతి కొత్త ఆవిష్కరణ మానవాళి శ్రేయస్సుకు సేవ చేయడంతో పాటు ప్రజలను ఆశ, సత్యం మరియు క్రీస్తు వైపు నడిపించాల్సిన అవసరం ఉందని పోప్ పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN