అపొస్తులవలే పోరాడాలి

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
23 May 2026
పాస్క ఏడవ శనివారము
మొదటి పఠనము : అపో 28:16-20, 30-31
సువిశేష పఠనము : యోహాను 21: 20-25
పౌలు గారు యెరూషలేములో అరెస్ట్ చేయబడి, కైసరుని సమక్షములో విచారణ పొంది, ఖైదీగ రోముకు పంపబడి, సముద్రప్రయాణములో అనేక కష్టాలను చవి చూసి, చివరకు రోముకు చేరుకున్నాడు. అక్కడ ఆయనకు స్వేచ్ఛ వచ్చింది, నివాసము వచ్చింది. పౌలు గారు అంతటిని వివరించారు. తన బాధ లకు కారణం ఇజ్రాయెల్ నిరీక్షణ అని క్రీస్తు యేసు ద్వారా రక్షణ అని, పునరుత్తాన బోధన అక్కడి వారికి పడలేదని ఆ బోధన వారికి నచ్చలేదని , కానీ, దేవుని కార్యాన్ని ఎవరు ఆపలేరని, ధైర్య సాక్షం గా నిలబడాలని, సర్వలోక సువార్తకై పాటుపడాలని, అందరికి సువార్త చేరాలని, క్రీస్తు కొరకు మనకు వున్న అనుగ్రహాలు ఉపయోగించు కోవటం ఎంతో మేలని, బంధీ గా ఉండటం, ఆయనకోసం పాటుపడటం, లోక శ్రమలను అనుభవించటం సిగ్గు కాదని, అవి సాక్షానికి నిలువెత్తు గుర్తులు అని మనము ద్యానించుకువాలి ప్రియులారా. పౌలుగారి ప్రత్యేక దైవ పిలుపు మనకు ఎంతో ఆదర్శం. మనకు ఎంతో ఆదర్శనీయం, మరియు మనకు ఎంతో అభినందనీయం.
దేవుడు మనలను ప్రత్యేక ఉద్దేశం కొరకు పిలిచాడు. ప్రత్యేకించబడినవారము, ఎవరిని ఎల వాడుకోవాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఎంత అవసరమో, ఎరిగినటువంటి మహనీయులు మన ప్రబులవారు. దేవుడు ఇచ్చిన అనుగ్రహములను బట్టి ఇతరులపై అసూయను కనపరచటం మంచిది కాదు. తన శిష్యులు అందరూ కూడా దైవ పిలుపు కు తలవంచినప్పటికీ, వారు వారి వారి మేధస్సు, క్రియలు, కార్యాలను బట్టి వారి ప్రత్యేకులు. ఒకరికి వున్న అనుగ్రహం మరొకరికి లేని అనుగ్రహం మరొకరికి వుంది, కాబట్టి దేవుని సేవకై, దేవుని సేవలో, అత్యధికముగా వాడబడాలే కానీ, మనకు లేదని, వాళ్లకు ఉందని, మన అనుగ్రహమును కోల్పోవటం ఉత్తమము కాదు.
పేతురు గారి పరిచర్యవేరు,
పౌలు గారి పరిచర్య వేరు,
యోహాను గారి పరిచర్య వేరు,
మిగిలిన అపొస్తుల, వారి సహచరుల అనుగ్రహ పిలుపు వేరు, అనుగ్రహ పరిచర్య వేరు,...ఆయనకు వచ్చిన విధముగా ఆయన తన సేవకులను వాడుకుంటాడు. అందుకే ఆయన మనతో అంటున్నాడు, నన్ను వెంబడింపుము అని, కావున మనము అందరము ఆయనను వెంబడించాలి, ఆయనకోసం జీవించాలి, ఆయనకై అపొస్తులవలే పోరాడాలి, ప్రయానించాలి, అప్పుడే మనము దైవ రాజ్య విస్తరణ లో రానించగలము, రక్షింపబడగలము, కావున ఆ దీవెనకై దేవుణ్ణి మనసారా అడుగుదాం ఆయన ప్రత్యేక సేవలో బలముగా వాడబడాలని.
దేవుడు మనలను దీవించును గాక...
