చేరగలిగి నపుడె గౌరవమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
22 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
అన్ని పనుల యందు అభినివేశము గల్గు
నిపుణతను పలువురు నేర్వలేరు!
తెలిసిన పనిలోన మేలిమి లక్ష్యమ్ము
చేరగలిగి నపుడె గౌరవమ్ము!.
