క్రీస్తు పునరునత్తానాన్ని మనోహరముగా మాలిన్యం లేకుండా ప్రకటిద్దాము

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

21 May 2026

పాస్క ఏడవ శుక్రవారము
మొదటిపఠనము : అపో : 25:13-21
రెండవ పఠనము : యోహాను 21:15-19

యోహాను 21:17....అప్పుడు యేసుక్రీస్తు వారు “నా గొర్రెలను మేపుము” అనెను.

రాజు అగ్రిప్ప మరియు బెర్ణిక కైసరియాకు గవర్నరు పెస్తేరు ను కలుసుకుంటారు. అప్పుడు పౌలు ఖైదీగా వున్నాడు. పేస్తు కొత్తగా యూదయా పాలకుడిగా నియమింపబడి, పౌలు విషయముపై అగ్రిప్పకు వివరిస్తాడు. యూధులు తీవ్రమయినా ఆరోపణలు చేసినప్పటికి, అతడు మరణదండనకు పాత్రుడైన ఏ తప్పు చేయలేదని పేస్తుకు అర్థం అవుతుంది. పౌలు తన హక్కును వినియోగించుకుని రోముకు వెళ్ళాడు. ఈ సంఘటన ద్వారా దేవుని యోచన ప్రకారం రోముకు వెళ్లి సువార్తను ప్రకటిస్తాడు. సత్యం కోసం నిలబడినవారిని దేవుడు నడిపిస్తాడని పౌలు జీవితం ద్వారా అర్తం కావటం లేదా, పరిస్థితులు ఏవైనా దేవుని కార్యం ఆగదని తెలియటం లేదా, పౌలు వలె విశ్వాస, ధైర్య సాక్షి గా నిలవాలని ఆయన పరిచర్య మన తలుపులు తట్టడం లేదా, ఆయన పునరుత్తానము మన జీవితాల మధుర సువాసనగల కేంద్రం అని పౌలు గారి జీవితం మనతో మాట్లాడుతుంది కదా........


ప్రియులారా పేతురు గారు మూడు సార్లు బొంకారు. ప్రభువుల వారు ఒకవైపు సిలువ మోసుకుంటూ పోతూ ఉంటే, పేతురు మరియు ఇతర శిష్య బృందము పారిపోయారు, వణికిపోయారు, తమను తాము దాచుకున్నారు. పిరికితం వెంటాడిందే కానీ, దైర్యం ముందుకు రాలేకపోయింది. కొడతారేమోనన్న భయం, ఆ ఇద్దరి దొంగలను కట్టేసి కొట్టిన విధముగా, కాళ్ళు విరిచిన విధముగా చేస్తారేమోనన్న ఆందోళన భయబ్రాంతులకు గురించేసింది. అటువంటి పరిస్థితులలో వున్న శిష్యులందరికి పునరుత్త్తాన ఘట్టం భయాన్ని పూర్తిగా తొలిగించింది.

పేతురు గారు మారిపోయారు. అప్పుడు బొంకిన పేతురు, ఇప్పుడు శిష్యులందరికి నాయకుడు, మనందరికి తొలి జగద్గురువులు. బొంకాడు, వదిలివేసాడు, అవకాశవాది, అబద్ధాలాపుట్ట, నేర్పరితనం మక్కువ, మనుషులను బట్టి ప్రవర్తించేవాడు, పరిస్థితులను బట్టి ఆలోచన, అని పేతురు గారిపై ఇలాంటి మాటలు, దూషణ, లేకుండా...... “నా గొర్రెలను మేపుము” అని అంటున్నాడు. ఆ మాటలు విన్నాక పేతురు గారికి ఏమి చేయాలో, చేయకూడదోనన్న పరిస్థితి, యేసయ్య కు అన్ని తెలుసు అని, అంతయు ఎరుక అని, పేతురు గారికి తెలిసిన, ప్రభు మీకు తెలియనివి ఏమైనా ఉన్నదా, మీ చిత్తం, మీ ప్రణాళిక లో నేను ప్రయానింపసాగాలని, అనుకుంటున్నా, నా జీవితం, ఇక నీదేనని, నా ప్రతి శ్వాసనువు నీకేనని, అప్పటివలే బొంకను, వెనుకడుకు వేయను భయపడను, కచ్చితంగా, నిన్ను వెంబడిస్తానయ్యా, అందరిముందు చెప్పుచ్చునాడు.


“నన్ను వెంబడించు అని అంటున్నాడు”.... అంటే..... శ్రమలకు, నిందలకు, అపవాధులకు, కష్టాలకు, పరిచర్య పరిస్థితులకు, ప్రజల తిరుగుబాటులకు, లోక వ్యవహారాలకు, లోక వ్యవస్థకు, అనరాని మాటలకు, పడలేని పదజాలానికి, లోకనింద, ఆపనిందలకు, సాతాను సాక్షాత్తు క్రియలకు, అడ్డంకులకు, అలలకు సిద్దముగా వుండు.... అని..... నన్ను అనుసరించటం అంటే mobile లో చాటింగ్ చేసేంత ఈజీ కాదు, డీపి మార్చేంత ఈజీ కాదు మరియు ఇంస్టా లో స్టోరీస్ పెట్టేంత ఆహ్లాదము కాదు, నన్ను అనుసరించు, నా గొర్రెలను మేపు, అని ఆయన పేతురుతో చెప్పారు.


పౌలు గారు అనుసరించారు. ఎన్నో ఇక్కట్లకు, ఎందరో మనుషుల అహంకారాలకు పాటుపడ్డాడు. దేవుని ప్రేమ ప్రకటింపబడాలి అంటే, మనము కూడా ఈ మహానుభావులుగా మారాలి మార్చాలి క్రీస్తును ఇతరులకు పరిచయం చేయాలి. కావున మనము కూడా తప్పిపోయిన, తప్పిపోతున్న ఆయన మందను తిరిగి క్రీస్తుకు దగ్గర చేద్దాము. క్రీస్తు పునరునత్తానాన్ని మనోహరముగా మాలిన్యం లేకుండా ప్రకటిద్దాము.


దేవుడు మనలను దీవించును గాక...

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN