నాయకత్వం అంటే ఆధిపత్యం కాదు - పోప్
జోసెఫ్ అవినాష్
21 May 2026
నాయకత్వం అంటే ఆధిపత్యం కాదు, ప్రేమతో మరియు వినయంతో ఇతరులను నడిపించడం అని వాటికన్ వేదికగా గృహస్థ క్రైస్తవ విశ్వాస బృందాల ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.దేవుడు ప్రతి సంఘానికి ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడని,అవి వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం కాకుండా శ్రీసభకు మరియు ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడాలని అన్నారు.సంఘాల్లో విభేదాలు,గర్వం, వ్యక్తిగత ఆధిపత్యం పెరగకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించిన పోప్,పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగల వినమ్ర హృదయం నాయకులకు అవసరమని చెప్పారు. క్రైస్తవ జీవితం ఒంటరిగా నడిచేది కాదని, పరస్పరం ఒకరినొకరు ఆదుకుంటూ కలిసి విశ్వాస మార్గంలో నడవాల్సిన పిలుపు అని గుర్తుచేశారు. ప్రపంచానికి సువార్తను చూపించేది మాటలు మాత్రమే కాదు, ప్రేమతో కూడిన ఐక్య జీవితం కూడా అని పోప్ లియో XIV వివరించారు.
