క్రీస్తు పునరుత్తానమును ప్రకటిద్దాం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

20 May 2026

పాస్క ఏడవ గురువారము
మొదటిపఠనము : అపో 22:30: 23:6-11
సువిశేష పఠనము : యోహాను 17:20-26
అపోస్తుల 23:11.........మరునాటి రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలువబడి, దైర్యముగా ఉండుము.

దేవుడు తన సేవకులను కాపాడుతాడని, ప్రమాదాల మధ్యలో వున్న పౌలును దేవుడు రక్షించాడని, పునరుత్తాన విశ్వాసం క్రైస్తవ మతానికి, ఒక కేంద్రం అని, ఆ పునరుత్తాన సత్యాన్ని దైర్యముగా ప్రకటిస్తూ, ఆయనే నిజ స్వరూప పునరుత్తానుడని అందరిముందు దైర్యముగా పౌలు గారు ప్రకటించటం చూస్తున్నాము. ప్రభువు పౌలును కష్టసమయములో ఒంటరిగా విడచిపెట్టలేదు. దైర్యపరుస్తూ, ధైర్య మాటలను చెప్పుతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితం సాక్షముతో ముడిపడి ఉండాలి అని, ఒకే చోట కాదు, తెలియని ప్రజల మధ్యలో, తెలియని ప్రాంతములకు వెళ్లి బోధించమని పౌలుగారితో పాటు మనలను కూడా సంసిద్ధం చేస్తున్నారు మన క్రీస్తు వారు.

శిష్యుల ఐక్యతకోసం, పరిశుద్ధత కోసం, ప్రపంచం దేవుని ప్రేమను తెలుసుకోవాలని భవిష్యత్తు భక్తి విశ్వాసుల కోసం ప్రార్తించాడు.

A) విశ్వాసుల ఐక్యత
ఒకరై ఉండాలని కోరుకుంటున్నారు. ఐక్యతే ముఖ్యం, విబేధము కాదని, తెలియజేస్తున్నాడు. క్రైస్తవులు ప్రేమ ఐక్యముగా ఉండాలని, ఐక్యత మనలను నిలకడగాను, దేవుని సహవాసానికి దగ్గరగా ఉంచుతుంది అని బోదిస్తున్నారు.
B) సాక్షముతో కూడిన జీవితం
ప్రేమ, సహనం, మరియు ఐక్యత సువార్తకు గొప్ప సాక్షాలు. ప్రతి అణువు సాక్షముతో ముడిపడి ఉండాలి. సాక్షం లేని పరిచర్య, పరిచర్యే కాదని, సాక్షం నీ వసం కావాలని ఆ సాక్షం లోకానికి వెలుగై క్రీస్తును తెలియపరచాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు.
C) దేవుని ప్రేమలో భాగస్వామ్యం
ఆత్మీయ సంబంధాన్ని కలిగివుండాలి. ప్రేమ భాగస్వాములము అవ్వాలి. ప్రేమతో కూడిన సంబంధం, ప్రేమతో నిండిన భాగస్వామ్యం, ప్రేమై కూర్చున్న భాగస్వామ్యం మనకు ఎంతో శ్రేయస్కరము, మనకు ఎంతో ప్రేమము మరియు ఎంతో మనోహరము.
D) దేవుని ప్రేమ
దేవుని ప్రేమ ప్రతి విశ్వాసికి ఆధారమావ్వాలి. ఆ ఆధారం ఆభరణము అవ్వాలి, ఆ ఆభరణమైన ఆ సుగుణం క్రియలలో కనపడాలి, క్రియలలో కనపడిన ఆ ప్రేమ, క్రీస్తును ఇతరులకు పరిచయం చేయాలి, ఇతరులకు పరిచయం గావింపబడిన ఆ ప్రేమ, లోకాంత్యము వరకు, ప్రకటింపబడాలి, విస్తరణ గావింపబడాలని క్రీస్తు మనకు నేర్పిస్తున్నారు.


కావున మనము అందరము ఒకే కుటుంబానికి చెందిన వారసులము, మనది ఒకే కుటుంబం, ఒకే కుటుంబ సఖ్యత, ఒకే కుటుంబ నిర్వాహకులము, ఒకే ప్రేమను పొందుకున్న, నిత్య నివాసులము, కాబట్టి ఆయనను మరువక, ఆయన ప్రేమను కనపరుద్దాము, ప్రకటిదాము, ప్రకటించిన ప్రకారం జీవిద్దాము. ఆయన పునరుత్తానమును ప్రకటిదాం.

దేవుడు మనలను దీవించును గాక...

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN