క్రీస్తు మహిమలో భాగం పొందుకుందాం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
19 May 2026
పాస్క ఏడవ బుధవారం
మొదటి పఠనము : అపో :20:28-38
సువిశేష పఠనము : యోహాను : 17:11-19
యోహాను 17:14......నేను నీవాక్కును వారికి అందజేసితిని. కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలయన నావలే వారును లోకమునకు చెందినవారు కారు.
పౌలు తన మూడవ మిషనరీ ప్రయాణాన్ని ముగించుకుని యెరూషలేముకు వెళ్తున్న సమయములో ఇక ఏపేసు నగర విశ్వాసులను చూడలేనని, తెలిసిన వారితో చివరిసారి మాట్లాడుతున్నప్పుడు, కలిగిన బాగోద్వేగాలను మనము మొదటి పఠనములో చూడవచ్చు.
A) సంఘకాపరుల బాధ్యత 20:28)
జాగ్రత్తగా దేవుని మందను ప్రేమతో కాపాడాలని, యేసుక్రీస్తు వారి రక్తముతో సంపాదించిన సంఘమును రక్షించాలాని, బాధ్యతగా వుండాలని, విశ్వాసులను క్రీస్తు కు దగ్గర చేర్చే పూర్తి బాధ్యత మీపై ఉందని ఆయన చెప్పుతున్నాడు.
B) తప్పుడు బోధకుల హెచ్చరిక (20:29-31)
క్రూరమైన వాళ్ళు వస్తారని హెచ్చరిస్తున్నాడు. తప్ప ద్రోవ పట్టిస్తారు జాగ్రత్త గా ఉండాలని చెప్పుతున్నాడు. మెలుకువతో ఉండాలని, జాగరూతతో అడుగులు వేయాలని ప్రతి ఒక్కరికి పూస గుచ్చినట్టు తెలియజేస్తున్నాడు.
C) దేవుని వాక్యం పై ఆధారపడాలి (20:32)
వాక్యమే విశ్వాసులను బలపరుస్తుంది. పరిశుద్దజీవితాన్ని నడిపిస్తుంది. వాక్యం మనతో ఉంటే మనలను ఎవరు ఏమి చేయలేరు, సాతాను మనలను చెడు మార్గములో నడిపించలేదు అని బోదిస్తున్నాడు.
D) స్వార్థ రహిత సేవ (20:33-35)
నేను వెండి, బంగారు, మరియు వస్త్రాలను ఆశించలేదు, పనిచేసి అవసరాలను తీర్చుకున్నాను, పుచ్చుకోవటం కంటే ఇచ్చుట ధన్యం, సేవాబావం ముఖ్యం కానీ స్వార్థం మాత్రం కాదు అని పౌలు గారు తెలుపుతున్నారు.
E) బాగోద్వేగ వీడ్కోలు (20:36-38)
కన్నీళ్లతో ఆలింగణం, దుఃఖం, ఇక చూడలేరనే బాధ అందరిలో ఒకరకమయినా క్షోబను గురిచేసాయి. ఆత్మీయ ప్రేమ ను సంఘము తప కన్నీరు ద్వారా తెలియ జేశారు.
ప్రియులారా ప్రతి క్రైస్తవ విశ్వాసికి పునరుత్తాన క్రీస్తు మాటలు నరానరాల్లో నిలిచిపోవాలి. క్రైస్తవులుగా పిలవబడుతున్న మనందరిలో ఐక్యత ఉండాలి. ఐక్యతతో జీవించాలి. ఐక్యత ను పంచాలి. క్రీస్తు ప్రభువులవారి ఐక్యతను మనము అలవరచుకోవాలి, ఐక్యత లేకుండా, సఖ్యత లేకుండా, సమథౌల్యత లేకుండా, సమానత్వం లేకుండా, సద్గుణం లేకుండా, సహనం లేకుండా, భక్తిని కలిగివుండటం దేవునికి మెచ్చదగినది కాదు, దేవుడు ఆభక్తిని ప్రేమించడు.
లోకములో వున్నప్పటికిని లోకస్తులము కాకూడదు, లోక అలవాట్లకు, లోకాశలకు, లోక బాoధవ్యాలకు, లోక సంబంధాలకు, లోక మోసాలకు, లోక వ్యవహారాలకు దూరముగా ఉండాలని జాగ్రత్త గా జీవించాలని, లోకం దాని విశ్వాసం నాశనానికి మొలాకారణమే గాని, ఆదర్శజీవితానికి మాత్రం కాదు. చెడు లోకానికి నీవు ఎంత దూరం ఉంటే అంత మేలు. చెడు ను వదిలేస్తే అంత సౌమ్యమే మనకు. చెడు నిన్ను ఆత్మీయత నుండి దూరం చేస్తుంది. నిన్ను విశ్వాసములో బలపడనివ్వదు. నిన్ను చీడ పురుగువలే క్షణక్షణము క్షీనింపచేస్తుంది. దేవుని ప్రేమ కటాక్షాలకు దూరం చేస్తుంది. దేవుని ప్రేమ నీలో ఎదగనివ్వదు. వెలగనివ్వదు.
దేవుని వాక్యం మనకు ఎంతో ముఖ్యం. పరిశుద్దులుగ మారాలంటే వాక్యం మన స్వంతము అవ్వాలి. వాక్యం నిన్ను నన్ను మనలను మారుస్తుంది. వాక్యం నిన్ను నిలబెడుతుంది. ప్రయోజకున్ని చేస్తుంది, ఆశీర్వాదాలను పొందుకోగలవు, నిన్ను హెచ్చిస్తుంది, నీవు వాక్యముతో స్నేహం చేస్తే నీ జీవితం సుఖమయం, వాక్యమును నీవు పట్టుకుంటే, నిన్ను పట్టుకున్న చెడును తొలగిస్తుంది. ప్రియ జనాంగామ మనకొరకు ప్రార్థించే క్రీస్తు మనకు ఉండగా, మనతో ఉండగా, మనలోనే నివసించగా, కరుణ కోసం తాపత్రయ పడుతున్న నీకూ ఆయన కరుణామయుడని మరిచావ, నీకూ ఆయన ఒక ఆదర్శమూర్తి. జీవితము గాయమై, గాయము పుండై, ఆ పుండు చీడ పురుగుల వాసనతో నిండి వున్న,..... సుమధుర సుగంధ పరిమళ ద్రవ్యాల సువాసన గళ దేవుడు మనకై ఉండగా చెడు గబ్బు వాసన,....పరిమళం అవుతుందని గ్రహించలేకపోయావా... ప్రియ సహోద్దరి సహోద్దరులారా..........
కావున క్రీస్తు సందేశమును ధరించి, క్రీస్తు వెలుగులో ప్రయానింప వెలుగు పునరుత్తాన క్రీస్తు బిడ్డలుగా మనము ప్రతి క్షణము జీవిద్దాము,.... ఆయన చెప్పిన మాటలకు తలవంచి, లోకానికి తలవంచక, పునరుత్తా న క్రీస్తు మహిమలో నిరంతరం ఆశీర్వాదింప బడాలని క్రీస్తునాదున్ని వేడుకుందాము.
దేవుడు మనలను దీవించును గాక...
