దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

18 May 2026

పాస్క ఏడవ మంగళవారము
మొదటిపఠనము : అపో 20:17-27
సువిశేషపఠనము : యోహాను 17:1-11
ప్రియులారా దేవుని సేవను లోకముతో ముడివేయకుండా, లోకం + సేవ = లోక సేవలో కలపకుండా పునీత పౌలు గారి సేవను, సేవగా, సేవలో సేవకునిగా, సేవతో క్రీస్తును, సేవలో క్రీస్తు మహిమను, సేవలో క్రీస్తుఐక్యతను, ఔనత్యమును, సేవలో క్రీస్తు ప్రేమను తన ప్రయాణాల ద్వారానైయితేనేమి, తన సాటి స్నేహితుల సేవా ద్వారానైయితే నేమి, తన బాధల విధానాలద్వారానాయితేనేమి, గంభీరముగా ప్రకటించి, క్రీస్తును పరిచయం చేసి తాను ఎందుకు పిలువబడ్డాడో, తాను ఎందుకు ఎన్నుకొనబడ్డాడో, హృదయపూర్వకముగా ఆ ప్రణాళికలో లీనమై లోకం వద్దు క్రీస్తే ముద్దు, లోకం వద్దు బోధనే ముద్దు, లోకం వద్దు ఆయనను ప్రకటించటమే ముద్దు అని నడుము బిగించి, జీవించినంతకాలము సేవకై, సేవలో, నడిచిన వారు పునీత పౌలు గారు.

ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి అలసట లేని పరిచర్య చేసి, ఎందరికో ఉదాహరణముగా నిలవటం మనము చూస్తున్నాము. పౌలుగారు తన సమయమును, జీవితమును, తన శరీరమును, తన ఆలోచన విధానమును, తన అంతర్గీత బాహ్యముల, పరిస్థితులను అన్నింటిని కూడా ఒకటిగా మరల్చి, క్రీస్తుకై పాటుపడిన దీన సేవకులు ఆయన, నిజ విశ్వాసిగా ఉంటూ.. క్రీస్తును పరిచయం చేసిన గొప్ప నిస్వార్ధ సేవకులు మన పౌలు గారు. సమయమును, వనరులను, తన శక్తిని, దీనందిన జీవితమును, జ్ఞానమును, పరిపక్వతమును, తెలివితేటలను, మరియు మేధస్సును క్రీస్తుకై అర్పించిన అర్పణం ఈ పూనీతుడు. కాలము to కాలము, ప్రదేశం to ప్రదేశం, ప్రజలు to ప్రజలు, మైదానం to మైధానం, బోధించిన, మురిపించిన, మైమరపించిన, మరియు మెరిపించిన బోధకుడు, సేవకుడు పౌలు గారు...... ఈయన రానున్న సేవకులకు మాదిరి కనపరిచి ఎందరికో ఊరటను కలుగ చేసాడు.

ప్రభువుల వారు మనతో మూడు ముఖ్యమైన విషయాలను మన ముందు ఉంచుతున్నాడు..........
1) తండ్రి మహిమ కోసం యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నారు (యోహాను 1-5)..........ప్రార్తన తన ఆయుధం , ప్రార్తనతో ఎన్నో జయించాడు. ఎందరినో జయించాడు. లోకానికి ప్రార్తన ప్రాముఖ్యతను కనపరచ్చాడు. తండ్రి దేవుని సంబంధం మనకు నిత్యానందం అని ఆయన కై మన జీవితాలను అర్పించటం ఉత్తమం అని తండ్రిని వదలక, ఆయన మహిమకై ప్రార్థిస్తూ మనకు నేర్పిస్తూ, శిష్యులందరిని బలపరుస్తున్నారు.
2) నిత్య జీవం (17:3)........తాను బోధించిన ప్రతి బోధనలో నిత్య జీవం, సజీవం, అనునవి కళాకాడిగా బోధించారు. సర్వము తానై, అన్నియు తానై, సకల సర్వస్వం ఆయనే అని మనకు నొక్కి వక్కయిస్తున్నారు. ఆయనను విశ్వాసించే వారికి, నిత్య జీవం, నిత్య దీవెన, నిత్య పరిమళ కుసుమాంజుల పరిమళం మనకు సాధ్యమే నని మనకు చెపుతున్నాడు. మనలను, మనలకై, అందరిలో అందరిని, అందరిలో కలిపి మనకై నిలిచాడు.
3) శిష్యుల కోసం ప్రార్థన (17:6-11)....తాను ఎన్నుకున్న శిష్యులకై, ప్రార్థిస్తూ, లోక పరిచర్య ఇక మీ చేతిలో ఉంచుతున్నాను, మీరు దైర్యం వహించండి, నేను ముమ్ములను బూదిగంతుల వరకు వదలను, విడువను, మీతోనే వుంటాను, ఆదరణ ను పంపిస్తాను అని.. ప్రార్థనతో బలపరుస్తున్నాడు, ప్రార్థన ప్రాముఖ్యకతను కళ్లకు కట్టినట్టుగా హృదయం స్వీకరించినట్టుగా మనసారా వారితో మాట్లాడుతూ,......... ప్రార్థన తో వారిని నింపుతున్నాడు. దేవుని రక్షణను, ఎందరికో అబ్బాలని, విశ్వాసులను ఐక్యత బావముతో చూడాలని, దేవుని మహిమకోసం అందరం జీవించాలని వారికోసం ప్రార్థిస్తూ........ వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. కావున మనము కూడా అయన తో కలిసి ప్రార్తనను ధరించి, కావాల్సినవి మనము కూడా క్రీస్తు మహిమ ద్వారా పొందుకుందాము.


దేవుడు మనలను దీవించును గాక..

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN