నకిలీ వార్తలను నిరోధించండి - పోప్
జోసెఫ్ అవినాష్
18 May 2026
మే 17, ప్రపంచ సమాచార దినోత్సవం సందర్భంగా విశ్వ కాపరి పోప్ లియో XIV తన సందేశాన్ని అందించారు ఆయన మాట్లాడుతూ,ఈ రోజుల్లో కృత్రిమ మేధస్సు(AI),డిజిటల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ,మనుష్యుని ప్రత్యేకతను,అతని స్వరాన్ని,రూపాన్ని,భావోద్వేగాలను ఏ యంత్రం భర్తీ చేయలేదని ఆయన గుర్తుచేశారు.కమ్యూనికేషన్ అంటే కేవలం సమాచారం పంచుకోవడం కాదు;అది మనుషుల మధ్య నిజమైన సంబంధాలు,ప్రేమ,నమ్మకం,బాధ్యతను పెంచేదిగా ఉండాలని ఆయన చెప్పారు.సాంకేతికత మనిషికి సేవ చేయాలి గానీ, మనిషి ఆలోచన,వివేచన,మానవత్వాన్ని బలహీనపరచకూడదని పోప్ స్పష్టంగా హెచ్చరించారు.ముఖ్యంగా యువత సత్యాన్ని గుర్తించే జ్ఞానం, విమర్శనాత్మక ఆలోచన,పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అధికశాతం కృత్రిమ మేధస్సు మీద ఆధారపడకుండా దేవుడిచ్చిన జ్ఞానాన్ని వినియోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన హితవు పలికారు.
