ప్రభుని మోక్షరోహణం పరలోక ద్వారాలను తెరిచింది - పోప్
జోసెఫ్ అవినాష్
18 May 2026
క్రీస్తుప్రభుని మోక్షరోహణం పండుగ సందర్భంగా వాటికన్ వేదికగా విశ్వ కాపరి పోప్ లియో XIV పండుగ సందేశాన్ని విశ్వాసులతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుని మోక్షరోహణం అనేది కేవలం జరిగిపోయిన సంఘటన కాదని, ఈరోజుకు కూడా ప్రతి విశ్వాసిని దేవుని దగ్గరికి నడిపించే సజీవమైన పిలుపు అని అన్నారు. క్రీస్తు తన జీవితం ద్వారా మనుష్యులను పాపం,చీకటి,నిరాశల నుండి బయటకు తీసుకొని ఆశ, క్షమ,నూతన జీవితం వైపు నడిపించాడని ఆయన గుర్తుచేశారు. ప్రభుని మోక్షారోహణం పరలోకం మనకు దగ్గరలోనే ఉందని తెలియపరుస్తున్నదని అక్కడికి మనం వెళ్లాలంటే క్రీస్తు బిడ్డలుగా ఉన్నతమైన జీవితాన్ని జీవించాలని ఆయన తెలియపరిచారు.
