క్రీస్తు మనకు అండై ఉండగా మనకు ఏలా దిగులు

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
17 May 2026
పాస్క ఏడవ సోమవారము
మొదటి పఠనము : అపో 19:1-8
సువిశేష పఠనము : యోహాను 16:29-33
యోహాను 16:33......ఈలోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ దైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని.
యేసుక్రీస్తులో సంపూర్ణ విశ్వాసం అవసరమని, పరిశుద్దాత్మ జీవితం ప్రతి క్రైస్తవునికి శక్తినిస్తుందని, దేవుని వాక్యాన్ని భయములేకుండా దైర్యముగా ప్రకటించాలని, పశ్చతాప జీవితం నుండి క్రీస్తు వైపు మార్పు ఉత్తమము అని, పునీత పౌలు గారు ఎపేసు నగర విశ్వాసులతో మాట్లాడుతూ వారిపై చేతులు ఉంచగా పరిశుద్దాత్మ వారి మీదికి దిగి రావటం చూస్తున్నాము (అపో 19:6).
ప్రియులారా క్రైస్తవ్యం అంటే సుఖమయమని, క్రీస్తుని అనుసరించటం అంటే సులభతరమణి, ఆయనను నమ్ముకుంటే మనము కూడా అబ్రాహామువలే సంపూర్ణముగా దీవింపబడవచ్చు, యోసేపు వలె దేశానికి ప్రధానమంత్రి కావొచ్చు, మోషే వలె సముద్రమును చీలికలుగా చేయవచ్చు, ఎస్తేరు వలె మహారాని కావచ్చు మరియు దావీదు వలె మహారాజు కావొచ్చని, అల్ప విశ్వాస, అర్ద విశ్వాసముతో అర్తం చేసుకునే, చేసుకుంటున్న ప్రతి క్రైస్తవునికి, మరియు క్రైస్తవురాలికి ఈరోజుటి పఠనాలు బోదిస్తున్నాయి, క్రైస్తవ్యం మరియు క్రైస్తత్వం అంత సులభతరము కాదని ఈలోకమున మీరు కష్టాలు పొందుతారని సాక్షాత్తుగా ప్రభువుల వారే పలుకుచున్నారు. ఆయనను నమ్మినప్పుడు, ఆయనపై విశ్వాసమును కనపరిచినప్పుడు, ఆయనను ఇతరులకు తెలియజేసినప్పుడు, ఆయనపై వున్న ప్రేమను గళమెత్తి గర్జించినప్పుడు, ప్రతి ఒక్కరు శ్రమలగుండ ప్రయానించవలసినదే, ఆయనను, ఈలోకము అంగీకరించలేదు, ఆలింగనము పరుచుకోక, దూషకూడని, దోషకూడని, బెల్జబూలు వంషానికి చెందినవాడని, తిండిబోతని, అనేక లోక బిరుదులతో క్రీస్తును సన్మానించారే గానే, ఆయన ప్రేమ ప్రణాళికను అర్తం చేసుకోలేక పోయింది ఈ ఖగోళం.
నాడు ఆక్రీస్తు, నేడు ఆ క్రీస్తు అనుచరులమైన మనము, మరి సంసిద్దముగా వున్నామా లేక అసంసిద్దముగా అడుగులు వేస్తున్నామా అని మనము ఆత్మపరిశీలన గావించుకోవాలి. ఆయనను వెంబడించినప్పుడు............... దూషిస్తారా అంటే... దూషిస్తారు, కొడతారా అంటే కొడతారు, తిడతారా అంటే తిడతారు, చంపుతారా అంటే చంపుతారు, నాశనం చేస్తారా అంటే చేస్తారు, కుట్ర పన్నుతారా అంటే పన్నుతారు, ప్రేమించరా అంటే ప్రేమించరు, సహోద్దర బావం ఉండదా అంటే ఉండదు, మానవత్వం కనపరచరా అంటే కనపరచరు, సాటి మానవ నైజం ఉండదా అంటే ఉండదు, సమాజహీనులుగా చేస్తారా అంటే చేస్తారు, తప్పు లేకున్నా శిక్ష వేస్తారా అంటే వేస్తారు మరి నీవు సంసిద్దమా ఆయనను వెంబడించుటకు.
గ్రహం స్టేయిన్స్ భారతదేశమునకు బోధించుటకు, పేదలకై తోడుగా సహకారన్ని చూపుటకు వస్తే తనను, తన ఇద్దరి కుమారులను సజీవదహనం చేయలేదా...........కన్యాస్త్రీ రాణి మరియను చంపలేదా...........వార్తా పత్రికలలో చూస్తున్నాముకదా క్రైస్తవ మత గురువులను కన్యాస్త్రీలను మరియు విశ్వాసులను ఎలా శిక్షిస్తున్నారో. క్రీస్తును అనుసరించటం అంటే D mart కు వెళ్లి బిర్యాని ingredients కొని బిర్యాని సువాసనను ఆస్వాదించేంత సులభతరము అని అనుకుంటున్నారా ప్రియ సహోద్దరి సహోద్దరులారా.......కానీ మనకు అంత కష్టమొచ్చినా, వాటిని జయించవచ్చు మనము. కష్ట వేదనలు ఎంతకష్టమో వాటిని ఎదుర్కొని జయించటం కూడా అంతే సులభము. ఎందుకంటే మన కొరకు యుద్ధం మనక్రీస్తు చేస్తాడు, మనకై ఉంటాడు, ఆయన మన సృష్టికర్త, మన మెసేయ్య కాబట్టి... ఆగమ్మతును మనము ఎప్పుడు మరువకూడదు.
దైర్యముతో నిలిచి పౌలు గారు బహిర్గముగా బోధిస్తూ, బ్రతికితే క్రీస్తు, చనిపోతే మేలని కళాకండిగా లోక శిక్షలకు, కష్టాలకు, బయపడి, బోధన చేయలేదు. గుండెనిండా క్రీస్తు దైర్యముతో మనస్సునిండా విస్తరణ బావముతో, తనకు ఏమైనా పర్లేదు, తన తండ్రి క్రీస్తు అమితముగా ప్రకటింపబడాలని, బోధించాడు, ఆశీర్వారించాడు, జ్ఞాన స్నానము ఇచ్చాడు, పరిశుద్దాత్మా ను పొంది, ఇతరులపై కుమ్మరించాడు, దీవెన పొందాడు, దీవెన కరముగా మారాడు. క్రీస్తే సర్వస్వమని గళమెత్తాడు
పరీక్షలలో బలపడాలి, లోకానికి తలవంచకూడదు, కష్టాలలో నిలబడాలి, లోకానికి బయపడకూడదు, లోక స్నేహముకన్నా, ఆత్మీయ స్నేహం మిన్న, శాంతి ప్రధాత అయినా క్రీస్తు మనకు అండై ఉండగా మనకు ఏలా దిగులు, చింత, మరి ఆయనవలే మనము కూడా జీవిస్తూ, ఆయనను మన జీవితకాలము అంత స్తుతిద్దాము, కీర్తిద్దాము, ఘనపరుద్దాము, ప్రకటిద్దాము మరియు ఆత్మీయ క్రీస్తు ప్రయాణములో బలపడుదాం.
దేవుడు మనలను దీవించును గాక..
