క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
17 May 2026
మరణము మనుషులకు మరల జీవమిడదు!
శాశ్వత మగు నిద్ర సంక్రమించు
మనుజ జన్మముండి మరణమ్ము నోడించి
అవని గాచిన ప్రభు! అంజలింతు!.
సర్వ మానవాళి సకల పాపములను
సిలువ ధారివగుచు శిరము నుంచి
మృత్యువును వరియించి మృతిని గెలిచి
పరము చేరిన ప్రభు! కరము మోడ్తు!.
