క్రీస్తు మోక్షారోహణ పండుగ వ్యాసం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
16 May 2026
క్రీస్తు మోక్షారోహణ మహోత్సవం
యేసుక్రీస్తు ప్రభువు మోక్షారోహణమైనవేళ, భక్తుల హృదయాల్లో ఆనంద కెరటాళ వేళ
మొదటి పఠనము : అపో :1:1-11
రెండవ పఠనము : ఎఫెసీ : 1:17-23
సువిశేష పఠనము : మత్తయి :28:16-20
పునీత ఆగస్తీన్ గారు...... ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యారు. మన హృదయాలు కూడా ఆయనతో పాటు పైకి ఎగసిపోవాలి.
పునీత లియో ది గ్రేట్ గారు..... క్రీస్తు ప్రభువు మోక్షరోహణం మన ఉన్నతీకరణమే శిరస్సయినా క్రీస్తు మహిమలో ముందుకు వెళ్లిన చోటుకు శరీరమైన మనము ఆశతో ఆయనను అనుసరించుటకు పిలవబడ్డాము.
యేసుక్రీస్తు వారు జీవించి ఉన్నటువంటి ప్రభువులు అని,పరిశుద్దాత్మ శక్తి ద్వారా క్రైస్తవ జీవితం సాగుతుందని,ప్రతి విశ్వాసి క్రీస్తుకు సాక్షిగా జీవించాలని, ఆయన మళ్ళీ రానున్నారనే నిరీక్షణ లో జీవించాలని, దేవుని నిజమయిన జ్ఞానం పరిశుద్దాత్మ ద్వారా వస్తుందని, క్రైస్తవ పిలుపు ఆశతో నిండి ఉండాలని, పునరుత్తాన శక్తి మన జీవితాలలో కూడ పని చేస్తుందని, యేసుక్రీస్తు వారు మన శ్రీసభకు శిరస్సు మరియు ఆయనే మూలాధారం అని మనకు తల్లి శ్రీసభ బోధిస్తుంది. ఈ మొక్షారోహణము ఆశకు, విజయానికి మరియు నిత్యజీవానికి సూచిక. మనము పిలిప్పు 2:9 చదువుతే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు హెచ్చించెను అని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఆయన మహిమలో ప్రవేశిస్తున్నారు అని ఈ మహోత్సవం తెలియజేస్తుంది, మనకు పరలోక ఆశను ఇస్తుంది, మన విస్తరణ ప్రారంభం మొదలు అవుతుంది. పరిశుద్దాత్మ వాగ్దాణం కూడ నెరవేరబోతుంది. ప్రియులారా మన హృదయాలు పరలోక విషయాలపై నిలవాలి, పరలోక జీవితం మన అంతిమ గమ్యం అని మరువకూడదు.
యోహాను 14:2,3.... నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. ప్రియులారా ఆయన జననము మనకొరకే, మరణము మనకొరకే, పునరుత్తానం మనకొరకే, మోక్షారోహణంమన కొరకే మరియు రెండవ రాకడ కూడ మనకొరకేనని ఈరోజు మహోత్సవం మనందరితో మాట్లాడుతుంది. నేను మీకొక నివాస స్థలమును సిద్దము చేయబోవుచున్నాను అని పలుకుచున్నాడు (యోహాను 14:2). ఈ బూలోక నివాసము తాత్కాలికము, మనదేశము పరలోకము, మనము అందరము పరలోక పౌరులము అని (పిలిప్పు 3:20) చెప్పుతుంది. కాబట్టి మనందరికి నిత్యనివాస గృహములు ఏర్పరచుటకు ఆయన మోక్షారోహనమవుతున్నాడు. సిద్ధము చేయటానికి వెళ్లుచున్నాడు, మనకొరకు తన తండ్రితో మాట్లాడానికి, మనందరికీ లైఫ్ సెటిల్ చేయుటకు మనందరి కొరకు మాట్లాడుటకు, మనందరికీ కావాల్సిన వన్నియు అక్కడ వసగుటకు ఆయన ముందుగా వెళ్లుచున్నాడు.
యోహాను 14:3.......మీరును ఉండునట్లు.......ఒక నివాసము సిద్దపరుచుటకు, మరలవచ్చుటకు, ఆయన వుండు స్థలముననే మనము కూడా ఉండుటకు, కావాలసిన సదుపాయాలు చేయుటకు ఆయన వెళ్లుచున్నాడు. ప్రియులారా కొంచెం లోతుగా ద్యానిస్తే మనకు ఎందుకు ఆయన నివాసములు ఏర్పారచాలి? మనకు ఏ అర్హత వుంది? మనము అంత భాగ్యులమా? ఆయనకు ఏమి అవసరము? ఆయనకు ఎందుకు అంత రిస్క్? ఆయన మనకోసం ఎందుకు ఇవ్వన్నీ చేయాలి? మనము ఏపాటివారము? ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేయాలి?... జీవితకాలము మొత్తం లెక్కలేనన్ని తప్పులు, పాపాలు చేస్తునందుక, మనకు ఇవన్ని, చేస్తున్నాడా, మనము ఏమైనా పున్యాత్ములమా? ఎందుకు, దేనికి ఇవన్నీ ఆయన చేస్తున్నాడు, అంటే.............. నీవు ఆయనను ప్రేమించకపోయినా, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, అర్హతతో పిలిచాడు కాబట్టి, తన రూపాన్ని ఇచ్చాడు కాబట్టి, మనలను సృజించాడు కాబట్టి, అన్ని విధాలుగా మనతో వుంటున్నాడు కాబట్టి, కేవలం నీకొరకె, నీ క్షేమం, నీ నిరీక్షణ కోసమే, నీవు బాగుండాలని, నీవు మంచి జీవితాన్ని కొనసాగించాలని ఇవన్నీ మనకోసం చేస్తున్నాడు.
ఆయన వెళ్ళేది మరల వచ్చుటకే కానీ అక్కడే ఉండుటకు కాదు. ఆయన రాడని కాదు, మోక్షరోహణం అంటే ఇక మనకు కనపడడు అని కాదు, ఆయనను చూడలేమని కాదు, ఆయనను స్మరించలేమాని కాదు, కానీ, ఆయన మోక్షరోహణం మనకు నిత్య ఊరట, మనకు బలమయిన నమ్మకం, విశ్వాసం, వెళ్తున్న ఆయన రెండవ రాకడలో కొట్లాది దేవధూతల సమూహములో నిన్ను నన్ను, మనలను తీసుకువెళ్తాడని, పరలోకములో భాగస్వామ్యం అనుగ్రహిస్తాడని దీని అర్తం.
యోహాను 16:7........నేను వెళ్ళనచో, ఓదార్చు వాడు......... ఓదార్చు వాడు వస్తే....... మనకు తోడు, మన భక్తి లో తోడు, విశ్వాసములో తోడు, మన లను పాపాల నుండి దూరం చేస్తాడు, రెండవ రాకడకు సిద్ధం చేస్తాడు, లోకాశలనుండి, లోకము నుండి వేరు చేసి మనలను రక్షిస్తాడు. మనకై 24/7 పనిచేస్తాడు. ఆయన మనలను వదలడు, మనకు ఓర్పును, దైర్యమును, సుకృతమును, ఓదార్పును మహిమను, ఇస్తాడు, సత్యం లోనికి, దర్మం లోనికి, మంచిలోనికి, పరిపూర్ణమయినా సత్య సజీవ మార్గములోనికి నడిపిస్తాడు. తండ్రి ప్రేమను, కుమార ప్రేమను దగ్గర చేస్తాడు. మన అందరికి అన్ని విధాలుగా తోడై ఉంటాడు. క్రీస్తు వారి ఆరోహనం, పరిశుద్దాత్మ ఆగమనము జరుగుతాయి.
ఆయన మనలను దూరం చేసేవాడు కాదు, అనాధలుగా వదిలేవాడు కాదు, మనకై అగ్నిని కురిపించి నాశనం చేసేవాడు కాదు, కాబట్టే, ఆదరణ కర్త మనకు అండగ, నీడగా, అన్నియువై వుండు టకు ఆయన అవరోహిస్తే, ఈయన ఆరోహిస్తున్నాడు. (యోహాను 14:28......నన్ను ప్రేమించిన యెడల........ ప్రియులారా మనము సంతోషించాలి....... బాధపడకూడదు, మనలను అంతం చేయడు, ప్రతీకారం తీర్చుకోడు, బాధపెట్టడు, ఈ మొక్షారోహణము మనకు సంతోషధాయకమే, సంతోషం తో ఆయన వెళ్లి తండ్రి కుడి ప్రక్కన కూర్చుని మనకోసం మధ్యవర్తిగా మాట్లాడుతాడు. ఆయనను ప్రేమిస్తున్న మనము ఆయన సంతోషమును పంచుకోవాలి, భాగస్తులము కావాలే కానీ, అబాగస్తులము కాకూడదు.
(జెకర్యా 14:4.......యెరూషలేమునకు తూర్పు ప్రక్కన అని....... ఈ మొక్షారోహణము గురించి అక్కడ చూడవచ్చు.
(హెబ్రీ:14:4........ఆకాశమండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడు..........
(పిలిప్పు 2:9-11....క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. యేసుక్రీస్తు వారు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటించాలి. ప్రతి నాలుక, ఈయనే మెసేయ్యా అని ప్రకటించాలి, మొఖరించాలి, ప్రతిఒక్కరు ప్రభువుల ప్రభువు అని, ఒకే ఒక్క దేవుడు అని, మన సృష్టికి కారణం అని, మన ఉనికికి ఆరాద్యం అని, మన శ్రేయస్సుకు సంతోషమునకు కారణం ఈయనేనని, ఈయనకంటే మరో దేవుడు లేడని, రాడని, మళ్ళీ జన్మించడని, ప్రతి ఒక్కరు పలకాలి, కావున ప్రియులారా నిత్య సత్య, సజీవ స్వరూపుడు ఈయనేనని ప్రకటిదాం..... తెలియని వారికి తెలియజేదాము.... ఈ మహోత్సవములో భక్తి పూర్వకముగా పాల్గొంటు.. నిత్య హెరాలమయిన దీవెనలను మనస్సునిండా పొందుదాము....................
దేవుడు మనలను దీవించును గాక..
