క్రీస్తు శిష్యులుగా మారుదాం
.jpg)
బ్రదర్ టోనీ నాగిపోగు MSC
15 May 2026
పాస్క ఆరవ శనివారము, (YEAR -A), 16-05-2026
మొదటి పఠనము :అపో 18: 23-28
సువిశేష పఠనము : యోహాను 16:23-28
యోహాను 16:23.....మీరు మీ తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. అలెగ్జాండ్రియ విద్యా మరియు జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన నగరం. అపోల్లొ వేద గ్రంధాలలో ప్రవీనుడు మరియు వాక్చాతూర్యముగలవాడు. యేసుక్రీస్తు వారిగురించి బోధించినప్పటికీ, అతనికి యోహాను బాప్తీస్మం వరకు మాత్రమే పూర్తిగా తెలుసు (అపో 18:24-25).
యోహాను16:24.........అడుగుడుమీసంతోషం పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు.
1. కుంటివాడు స్వస్థత పొందాడు (అపో 3:6)
2. అందుడైన భర్తీమయికి స్వస్థత (మార్కు10:52)
3. పదిమంది కుష్ఠురోగులు స్వస్థత (లూకా 17:14)
4. రక్త స్రావ స్త్రీకి స్వస్థత (మత్తయి 9:22)
5. పక్షవాత రోగికి స్వస్థత ( మత్తయి 9:6)
పునీత ఫ్రాన్సిస్ జీవియిర్...... అనేకులను యేసయ్య నామములో స్వస్థత పరిచారు. (మార్కు16:17-28...ఆయన నామములో మనము స్వస్థత పొందుతాము.
పునీత పాద్రేపియో......... ఆయన ప్రార్తనల తరువాత ఎంతో మంది ఆరోగ్యం పొందారు. అపో 9:34.....యేసుక్రీస్తు నిన్ను చూసి బాగ చేసివున్నాడు. నీవు నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా లేచెను.
ప్రియులారా యేసు నామములో శక్తి వుంది. ఆశీర్వాదం వుంది. ప్రతి అణువులో అద్భుతం వుంది. ఆయన నామమునుబట్టి ఎంత వారయిన ఆయన శక్తి తలవంచాల్సిందే.... అన్ని నామముల కంటే పై నామము మన క్రీస్తు నామము. ఎంతో గణమయినది. అందుకే ఆయన నామము నాటి ప్రజలను స్వస్థత పరిచింది, ఎందరికో ఊరటను ఇచ్చింది. నాడు, నీవు నేను మనము మధురమయిన ఆశీర్వాధాలను పొందగలుగుచ్చానాము అంటే అది కేవలము ఆయన శక్తి మాత్రమే. ( యోహాను 16:24...అడిగిన వారికి ఇచ్చే దేవుడు, తట్టిన వారికి తెరిచే దేవుడు, మరియు వెదికిన వారికి దొరికే దేవుడు). ఇంత శక్తివంతుడు అయినప్పటికీ ఆయన నామమును మనము మన జీవితాలలో ఎక్కువగా ఉపయోగించుకోలేకపోతున్నాము, మన సంతోషం పరిపూర్ణము కావాలంటే ఆయన నామమును జపించాలి. మనము కోరినవి బహుగా పొందాలి అంటే, ఆనంద బాష్పాలు మనకు రావాలి అంటే, ఆయన నామములో మనము బలముగా ఉండబడాలి. తన సేవలో మనము బాధ్యత గా వ్యవహారించాలి మన అపోలో లాగ, మన వరాలు ఆయనవే, మన స్వశక్తివి కానేకావు. మన వరాలు ఆయన సేవలో బహుగా ఉపయోగించాలి. క్రీస్తు కొరకు అపోలో వలె వాడాలి.
నిజమయిన ఆనందం మనకు కలగాలంటే దేవునితో సన్నిహిత సంబంధం మనకు ఉండాలి. Hi, bye సంబంధం కాదు, fantasy సంబంధం కాదు, advantage సంబంధం కాదు, 17th or 18th, max pro సంబంధం కాదు, లోకాశల శక్తి సామార్త్యాల సంబంధం కాదు, మోసపూరిత సంబంధం కాదు ఊసరవెల్లి, నటించే, రెండు విబిన్నాల ముకాల సంబంధాలు కావు, ఆయన కోరుకునే సంబంధం శిష్య సంబంధం, దగ్గరి సంబంధం. ఎప్పుడు అయితే ఆయనతో దృడముగా ముదివేయబడగలదో, ఎవరు కూడ తుంచలేరు, విరుగకొట్టలేరు, మరియు కాల్చలేరు. మరి నీ నా మన సంబంధం ఎలా వుంది, యావరేజా లేక బ్లాక్ బస్టర్ సంబంధమా ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ఆయనతో సంబంధము ఉంటే ప్రార్తనలో దృఢత్వం పెరుగుతుంది, దృఢత్వం పెరుగుతే, సంబంధం బలపడుతుంది, బలపడితే, శాశ్వతకాల సంబంధములో జీవించగలము, శాశ్వతకాలములో ఉంటే, వరాలు మన స్వతం, స్వంతం అయినా వరాలు మన వినియోగములో ఉండాలంటే ఆయన దీవెన అవసరము , దీవింప బడిన నీవు ఆయన నామములో స్వస్థత లు బహుగా చేయగలవు, ఆయన నామమును విస్తరణ చేయగలవు,, చేయగలిగే నీవు ప్రియ శిష్యునిగా, శిష్యురాలిగా ఆయన నామములో ఎన్నో అద్భుతాలను చేసేలా, క్రీస్తును పరిచయం చేసేలా మనలను మనము ఆ క్రీస్తుకై, హృదయ పూర్వకముగా సమర్పింపబడుదాము.
